AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: నాన్నకు అదిరే ఎలివేషన్ ఇచ్చి.. అంతలోనే గాలి తీశాడు.. ఎగ్జామ్‌లో స్టూడెంట్ ఫన్నీ ఆన్సర్

ఎగ్జామ్స్‌లో కొన్నిసార్లు స్టూడెంట్స్ రాసే సమాధానాలు భలే నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా కొందరు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ తన ఇస్మార్ట్ తెలివితేటలను.. ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా ఓ బుడ్డోడు రాసిన సమాధానం తెగ వైరల్ అవుతుంది. ఫుల్ డీటేల్స్ కథనం లోపల ...

Viral: నాన్నకు అదిరే ఎలివేషన్ ఇచ్చి.. అంతలోనే గాలి తీశాడు.. ఎగ్జామ్‌లో స్టూడెంట్ ఫన్నీ ఆన్సర్
Viral Exam Answer
Ram Naramaneni
|

Updated on: Aug 20, 2025 | 5:00 PM

Share

ఎగ్జామ్ టైమ్‌లో స్టూడెంట్స్ రాసే సమాధానాలు చదివితే కొన్నిసార్లు టీచర్లకే నవ్వు ఆపుకోలేని పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా బ్యాక్ బెంచ్ కంత్రీలు తమకు ఉన్న ఇస్మార్ట్ తెలివిని పేపర్‌పై ప్రదర్శిస్తూ ఉంటారు. వారి సమాధానాలకు మార్కులు రాకపోయినా.. మజా మాత్రం పక్కా గ్యారంటీ. ఇక తాజాగా ఓ చిన్నోడు రాసిన సమాధానం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రశ్న పేపర్‌లో ‘నీ హీరో ఎవరు?’ అని ప్రశ్న ఉంది. చాలా మంది పిల్లలు ఇలాంటి ప్రశ్నకు సినిమా హీరో పేర్లు రాస్తారు. కానీ ఈ స్టూడెంట్ మాత్రం తన మనసులోని మాట రాసేశాడు. ‘మా నాన్న’ అని క్లియర్ కట్ సమాధానం ఇచ్చాడు.

ఆ తర్వాతి ప్రశ్న ‘ఆయన్ని ఎందుకు హీరో అనుకుంటావు?’ అని ఉంది. ‘ఆయన చాలా ధైర్యవంతుడు’ అని సమాధానం రాశాడు. పర్ఫెక్ట్ ఎలివేషన్, పూర్తి గౌరవంతో పేపర్‌లో తండ్రిని అసలైన హీరోలా చూపించాడు. కానీ అసలు కామెడీ పంచ్‌ ఆ తర్వాత ఉంది. తదుపరి ప్రశ్న ‘నీ హీరో ఎవర్ని చూసి అయినా లేదా దేని గురించి అయినా భయపడతాడా?’ అని ఉంది. దానికి ఆ చిన్నోడు ‘అమ్మ’ అంటూ ఊహించని సమాధానం రాశాడు.

Also Read: నదిలో స్కూబా డైవింగ్ చేస్తుండగా మహిళకు కనిపించిన 100 ఏళ్ల నాటి సీసా.. దాని లోపల

తండ్రిని ఆకాశం ఎత్తుకు లేపిన చిన్నోడు.. ఒక్క వాక్యంతో గాలి తీశాడు. తండ్రి ధైర్యవంతుడు కదా, కానీ అమ్మ ముందు మాత్రం ఆయనకూ భయం ఉంటుందని చమత్కారంగా రాసేశాడు. ఇప్పుడు ఆ చిన్నోడు రాసిన సమాధానం నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. కొందరు ఇంత చిన్న వయసులోనే జీవిత సత్యం గ్రహించేశాడు బాబూ అని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి పొందే నిపుణుల చిట్కాలు
తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి పొందే నిపుణుల చిట్కాలు
అల్లు శిరీష్, నయనికల వివాహం.. రామ్ చరణ్ ట్వీట్..
అల్లు శిరీష్, నయనికల వివాహం.. రామ్ చరణ్ ట్వీట్..
పారేయండి..దానం చేయండి..సర్దండి! మనశ్శాంతి పెంచే చిట్కా
పారేయండి..దానం చేయండి..సర్దండి! మనశ్శాంతి పెంచే చిట్కా
పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర..
పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర..
నోరూరించే టర్కీ కోడి కూర ఇలా చేస్తే.. గిన్నె కూడా వదలరు
నోరూరించే టర్కీ కోడి కూర ఇలా చేస్తే.. గిన్నె కూడా వదలరు
క్యాన్సర్–అనీమియా.. నాలుక ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయొద్దు
క్యాన్సర్–అనీమియా.. నాలుక ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయొద్దు
బండిమీద టేస్ట్ వచ్చే చికెన్ పకోడీ ఇలా చేస్తే.. రుచి అదిరిపోతోంది
బండిమీద టేస్ట్ వచ్చే చికెన్ పకోడీ ఇలా చేస్తే.. రుచి అదిరిపోతోంది
జిమ్ వర్కౌట్స్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ ఆమ్లెట్
జిమ్ వర్కౌట్స్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ ఆమ్లెట్
పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ విల్లా కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ విల్లా కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
పొడి చర్మం ఉన్నవారికి వరప్రసాదం.. ఆలివ్ ఆయిల్
పొడి చర్మం ఉన్నవారికి వరప్రసాదం.. ఆలివ్ ఆయిల్