నాన్న, అమ్మమ్మతో కలిసి వీధిలో నిమ్మరసం అమ్ముతున్న చిన్నారి.. పేరెంటింగ్‌కు అర్ధం బాలిక తల్లిదండ్రులే..
ఇప్పుడు తల్లిదండ్రులకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. దీంతో పేద మధ్య తరగతి, ధనిక అనే తేడా లేదు.. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాలని భావిస్తున్నారు. తాము తిని తినక పిల్లల కోర్కెలు తీర్చుస్తూ ముద్దుగా పెంచుతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. అయితే పిల్లలకు కష్టం, బాధ్యత, బాధలు తెలియకుండా పెరగడం వలన భవిష్యత్ ఎటువంటి చిన్న కష్టాన్ని తట్టుకుంటారా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో అమ్మానాన్నలు తమ కూతురికి కష్టం వస్తే ఎలా తట్టుకోవాలో చెబుతున్నారు. ఆర్ధిక భరోసా కోసం ఎలా బలంగా నిలబడాలో నేర్పిస్తూ ఇది కదా అసలైన పెరెంటింగ్ అంటే అనిపించేలా చేశారు.

ఈ రోజుల్లో పిల్లలకు స్కూల్, ట్యూషన్, ఇల్లు, మొబైల్ ఫోన్లు తప్ప మరేమీ తెలియదు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు వారి జీవితాలకు, భవిష్యత్తుకు అవసరమైన పాఠాలు నేర్పించడంలో విఫలమవుతున్నారు. అందువల్ల పిల్లలకు చిన్న చిన్న కష్టాలు వచ్చినా.. వాటి ఎలా ఎదుర్కోవాలో, సమస్యలకు పరిష్కారాలు ఎలా కనుగొనాలో తెలియడం లేదు. దీంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకొక్కసారి ప్రాణాలు తీసుకునే స్టేజ్ కి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక తండ్రి తన కూతురికి జీవిత విలువలను, ఆర్థికంగా స్వతంత్ర జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించాడు. తన కూతురి చేసే మంచి పనికి ఆయన అండగా నిలుస్తున్నాడు. ఆ తండ్రి ఏడేళ్ల చిన్నారికి నిమ్మరసం అమ్మేంత వరకు తన పూర్తి మద్దతును కూడా ఇచ్చాడు. తండ్రి, కూతుళ్ల ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో purvaagx అనే ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక వీడియోను షేర్ చేస్తూ.. “నేను తన తండ్రి, అమ్మమ్మతో కలిసి రోడ్డు పక్కన నిమ్మరసం అమ్ముతున్న 7 ఏళ్ల అమ్మాయిని కలిశాను. నేను ఆ బాలిక తండ్రితో మాట్లాడినప్పుడు.. అతను చిరునవ్వుతో, “మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చదివారా?” అని అడిగాడు. మేమిద్దరం ఈ పుస్తకం చదువుతున్నామని చెప్పాడు. తండ్రి తన కూతురికి పుస్తకంలోని విషయాలను వివరిస్తున్నాడు. ఏడు సంవత్సరాల వయసులో తన కూతురికి ఇప్పటికే ఆర్థిక స్వాతంత్ర్యం గురించి నేర్పుతున్నాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా పెంచాలి. పిల్లలు ఉన్నత చదువులు చదవాలి..మంచి ర్యాంక్ రావాలి అని కోరుకోవడమే కాదు.. పిల్లలకు తల్లిదండ్రులు జీవిత విలువలను నేర్పించాలి. బాధ్యతాయుతంగా జీవించడం నేర్పించాలి” అని ఆ తండ్రి చెప్పాడు.
View this post on Instagram
ఈ వీడియోలో ఒక చిన్న అమ్మాయి వీధిలో నిమ్మరసం అమ్ముతోంది. ఆ బాలిక అమ్మమ్మ ఆమె పక్కన కూర్చుని ఉంది. ఇన్ఫ్లుయెన్సర్ ఫోటో తీయించవచ్చా అని అడుగుతుంది. చివరగా ఈ అమ్మాయి జ్యూస్ అమ్మడం వెనుక కారణం ఏమిటి? ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసుకోవడానికి అతను ప్రయత్నిస్తాడు.
ఆ చిన్నారి తండ్రి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తండ్రి చిన్నారి బాలికకు ప్రేరణ ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి రాసిన “రిచ్ డాడ్ పూర్ డాడ్” పుస్తకం చదవడం ద్వారా వచ్చిందని అన్నారు. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయం ఇద్దరు అబ్బాయిలు వ్యాపారం ప్రారంభించిన కథను చెబుతుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన విధానమే మాకు ప్రేరణ కలిగించిదని చెప్పారు. తదుపరి అధ్యాయానికి వెళ్లే ముందు మేము మొదటి అధ్యాయాన్ని ఆదర్శంగా తీసుకున్నామని చెప్పారు. తన కూతురికి 7 సంవత్సరాలు.. ఈ పుస్తకం చదివిన తర్వాత.. ఆమె నిమ్మరసం దుకాణం తెరవాలనే కోరికను వ్యక్తం చేసింది. నేను తన కూతురికి నో చెప్పి నిరాశపరచాలని కోరుకోలేదు. నేను నా కూతురికి మద్దతు ఇచ్చానని చెప్పారు.
ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు, ఒక యూజర్ ఇది మంచి పేరెంటింగ్‌కు నిజమైన ఉదాహరణ అని అన్నారు. మరొకరు తన తండ్రే తనకు రోల్ మోడల్ అని అన్నారు. మరొకరు వారు నిజంగా మంచి తల్లిదండ్రులు అని వ్యాఖ్యానించారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




