AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Masa Shivaratri: ఈ మాస శివరాత్రి రోజున 5 శుభ యోగాలు.. పెళ్లి కుదరడం లేదా.. ఎలా పూజించాలంటే

హిందూ మతంలో మాస శివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలా కృష్ణ పక్ష చతుర్దశి తిథి రోజున ఈ ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున ఆది దంపతులైన శివ పార్వతులను పూజించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి. కోరికలు నెరవేరుతాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈసారి మాస శివరాత్రి రోజు 5 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి.. దీంతో మాస శివరాత్రి ప్రాముఖ్యతను మరింత పెరిగింది.

Masa Shivaratri: ఈ మాస శివరాత్రి రోజున  5 శుభ యోగాలు.. పెళ్లి కుదరడం లేదా.. ఎలా పూజించాలంటే
Masa Shivaratri
Surya Kala
|

Updated on: Aug 20, 2025 | 1:34 PM

Share

ఈ ఏడాది శ్రావణ మాస శివరాత్రి పండుగ చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ మాస శివరాత్రి నాడు 5 అరుదైన, శుభప్రదమైన యోగాల గొప్ప యాదృచ్చికం ఏర్పడుతోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ యోగాలలో చేసే పూజ , ఉపవాసం ఫలాలు అనేక రెట్లు పెరుగుతాయి. ఎవరైనా శివుని ఆశీర్వాదం పొందాలనుకుంటే ఈ రోజున చేసే పూజ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ 5 శుభ యోగాలు ఏమిటి? ఈ రోజున పూజ శుభ సమయం, ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

మాస శివరాత్రి ఉపవాసం ఎప్పుడు? పంచాంగం ప్రకారం శ్రావణ మాసం కృష్ణ పక్ష చతుర్దశి తిథి ఆగస్టు 21 గురువారం మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రారంభమై ఆగస్టు 22 శుక్రవారం ఉదయం 11:56 గంటల వరకు కొనసాగుతుంది. కనుక ఉదయ తిథి ప్రకారం ఈ ఉపవాసం ఆగస్టు 21న మాత్రమే పాటించబడుతుంది.

ఏ శుభ యోగాలు నెలవారీ శివరాత్రి నాడు ఏర్పడుతున్నాయంటే

ఇవి కూడా చదవండి

శుభ యోగం: ఈ యోగం అన్ని రకాల శుభ కార్యాలకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ యోగం కింద చేసే పని ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవంతమవుతుంది.

అమృత సిద్ధి యోగం : అమృత సిద్ధి యోగంలో చేసే పని ఫలాలు శాశ్వతంగా ఉంటాయి. అమృతం లాంటివి. ఈ యోగంలో చేసే పూజ ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది.

అమృత యోగం: ఈ యోగ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూలతను తెస్తుందని భావిస్తారు.

గురు పుష్య యోగం: పుష్య నక్షత్రాన్ని అన్ని నక్షత్రాలకు రాజు అని పిలుస్తారు. గురువారం రోజున పుష్య నక్షత్రం వచ్చినప్పుడు దానిని గురు పుష్య యోగం అంటారు. ఈ యోగం సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని పెంచుతుంది.

సర్వార్థ సిద్ధి యోగం: ఈ యోగం అన్ని కోరికలను తీరుస్తుందని భావిస్తారు. ఈ యోగంలో పూజించడం, ఉపవాసం ఉండటం ద్వారా ఒక వ్యక్తి ప్రతి కోరిక నెరవేరుతుంది.

శివరాత్రి ఉపవాస పూజా విధానం మాసి శివరాత్రి నాడు శివుడిని పూజించడానికి ఈ సులభమైన పద్దతులను అనుసరించండి. ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. ఇంట్లో పూజ గదిని శుభ్రం చేయండి. శివపార్వతుల విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించండి. నీరు, పాలతో శివలింగానికి అభిషేకం చేయండి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త, అక్షతలు, పువ్వులు , గంధం అర్పించండి. శివ చాలీసా పారాయణం చేయండి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. చివరిగా శివ పర్వతులకు హారతి ఇచ్చి కోరిన కోరికలు నెరవేరాలని ప్రార్థించండి.

మాస శివరాత్రి ఉపవాసం ప్రాముఖ్యత మాసి శివరాత్రి ఉపవాసం శివ పార్వతులకు అంకితం చేయబడింది. ఈ ఉపవాసం ప్రతి నెలా కృష్ణ పక్ష చతుర్దశి తిథి రోజున ఆచరిస్తారు. ఈ ఉపవాసాన్ని పూర్తి ఆచారాలతో ఆచరించే భక్తుడు జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును పొందుతాడు. అంతే కాదు ఈ ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తీ చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతాడు మరియు మోక్ష మార్గం తెరుచుకుంటుంది. మాసి శివరాత్రి ఉపవాసం పాటించడం వలన యువతీ యువకుల వివాహంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని.. తగిన జీవిత భాగస్వామి లభిస్తుంది నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.