AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారికి రోజుకి ఎన్ని కేజీల బంగారు నగలను అలంకరిస్తారో తెలుసా.. ఓ భక్తుడు 121 కేజీల బంగారం భూరి విరాళం..

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూర్వకాలం రాజుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సామాన్యులు వరకూ స్వామివారిని దర్శించి తమ శక్తిమేర మొక్కులు చెల్లించుకుంటారు. వడ్డికాసుల వాడికి వేల కోట్ల ఆస్తులు ఉన్న సంగతి తెలిసిందే.. ఎన్నో సంవత్సరాల క్రితం మైసూర్ రాజులు, కృష్ణ దేవరాయలు వంటి అనేక మంది రాజులు శ్రీవారికి వారికీ భక్తితో సమర్పించిన వజ్ర, వైఢూర్యాలతో ఆభరణాలు అనేకం ఉన్నాయి. అయితే స్వామికి రోజుకి ఎన్ని కేజీల ఆభరణాలతో అలంకరిస్తారో ముఖ్య మంత్రి చంద్రబాబు చెప్పారు.

Tirumala: శ్రీవారికి రోజుకి ఎన్ని కేజీల బంగారు నగలను అలంకరిస్తారో తెలుసా.. ఓ భక్తుడు 121 కేజీల బంగారం భూరి విరాళం..
Tirumala Tirupati
Surya Kala
|

Updated on: Aug 20, 2025 | 6:33 PM

Share

కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావించి అశేష భక్త గణం పుజిస్తారు. దేవతలు సైతం పూజించే శ్రీవారిని అలాంటి రాజులతో పాటు నేటి ప్రముఖ రాజకీయ, పారిశ్రామిక వేత్తలు, సెలబ్రేటీలు నుంచి సామాన్యుల వరకూ అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తమ శక్తి కొలదీ చెల్లించుకుంటారు. అయితే శ్రీవారు అలంకర ప్రియుడు అన్న సంగతి తెలిసిందే.. స్వామి వారిని బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్యాలతో చేసిన వివిధ రకాల ఆభరణాలతో పాటు.. వివిధ రకాల పుష్పాలతో చేసిన మాలలతో కూడా అలంకరిస్తారు. అయితే స్వామికి అలంకరించే నగలు ఎన్ని కేజీలు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా.. ఇటీవల ఒక కార్యక్రమంలో ఏపీ సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. శ్రీవారికి అలంకరించే నగలతో పాటు ఒక అజ్ఞాత భక్తుడు ఇచ్చిన విలువైన బంగారు కానుకల గురించి కూడా తెలియజేశారు.

శ్రీవారి వైభవం నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నచందంగా సాగుతుంది. వెంకటేశ్వర స్వామికి అలంకారాలంటే చాలా ఇష్టం.. అందుకే ఆయనను అలంకార ప్రియుడు అని పిలుస్తారు. ఈ ఆభరణాల విలువ కూడా కోట్ల రూపాయల్లో ఉంటుంది. పురావస్తు శాఖ అధికారులే స్వామివారికి ఉన్న ఆభరణాల విలువను వెలకట్టలేకపోతున్నారు. అలంకార ప్రియుడు మలయప్పస్వామిని రోజుకు 120 కేజీల ఆభరణాలు ధరిస్తారని చంద్రబాబు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

తిరుమల శ్రీవారికి ఒక అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కేజీల బంగారంను భారీ విరాళంగా అందజేశారని చంద్ర బాబు చెప్పారు. అతను శ్రీవారి భక్తుడు అని.. ఒక కంపీనీ పెట్టక ముందు స్వామివారికి మొక్కకున్నట్లు చెప్పాడు.. శ్రీవారి ఆశీస్సులతో అతను పెట్టిన కంపెనీ మంచి వృద్ధిలోకి వచ్చింది. దీంతో అతను తన కంపెనీలోని 60 శాతం వాటాను 1.5 బిలియన్లకు విక్రయించాడు. అంటే సుమారు ఏడు వేల కోట్లు వరకూ డబ్బులు వచ్చాయి. అప్పుడు ఆ పారిశ్రామిక వేత్త ఇదంతా కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు దయే అని భావించి తనకు వచ్చిన డబ్బులో శ్రీవారికి కొంత మొత్తంలో విరాళం ఇవ్వాలని భావించాడు.

దీంతో స్వామివారికి 121 కేజీల బంగారాన్ని స్వామివారికి భూరి విరాళం ఇచ్చాడు. వెంకటేశ్వరస్వామికి రోజుకి 120 కేజీల ఆభరణాలతో అలంకరిస్తారని.. ఇప్పుడు ఈ భక్తుడు ఇప్పుడు 121 కేజీల బంగారం విరాళంగా ఇస్తున్నాడని.. అయితే ఆ భక్తుడు తన పేరు ఎక్కడా బయట పెట్టవద్దని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. అయితే వెంకన్న రోజులో ఎన్ని ఆభరణాలు ధరిస్తారనేదీ ఆ భక్తుడికి తెలియదు.. అతను ఇస్తున్న బంగారం విలువ ప్రస్తుతం 140 కోట్ల విలువ ఉంటుందని. చెప్పారు. అది కలియుగ దైవం మహిమ అంటే.. వెంకటేశ్వర స్వామిపై భక్తుడికి ఉండే నమ్మకం అంటూ చంద్రబాబు చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..