AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monorail Train: ముంబైలో భారీ వర్షాలు.. మోనోట్రైన్స్ బ్రేక్‌డౌన్.. భయాందోళనకు గురైన ప్రయాణికులు.. మొత్తం 782 మందిని రక్షించిన సిబ్బంది..

మూడు రోజుల వర్షం ముంబై మోనోరైలు వాస్తవికతను చూపించింది. చెంబూర్ ,భక్తి పార్క్ మధ్య మోనోరైలు చిక్కుకుపోయింది. సాంకేతిక లోపం కారణంగా యాణికులు లోపల చిక్కుకున్నారు. ఏసీ, లైట్లు ఆపివేయడం వల్ల ప్రజలు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. దీని తరువాత లోపల కేకలు వినిపించాయి. కొంతమంది మూర్ఛపోయారు. అగ్నిమాపక దళ అధికారి ఒకరు మాట్లాడుతూ, "ప్రజలు (ప్రయాణీకులు) భయపడ్డారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు కిందకు దూకడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రకమైన భయాందోళన విషాదంగా మారకుండా నిరోధించడమే మా ప్రాధాన్యత అని చెప్పారు.

Monorail Train: ముంబైలో భారీ వర్షాలు.. మోనోట్రైన్స్ బ్రేక్‌డౌన్.. భయాందోళనకు గురైన ప్రయాణికులు.. మొత్తం 782 మందిని రక్షించిన సిబ్బంది..
Mumbai Monorail Trains
Surya Kala
|

Updated on: Aug 20, 2025 | 9:34 AM

Share

భారీ వర్షాల కారణంగా ముంబైలో జనజీవనం స్తంభించింది. నిరంతర వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మగళవారం సాయంత్రం రెండు రద్దీగా ఉన్న మోనోరైలు రైళ్లు ఎలివేటెడ్ ట్రాక్‌పై చిక్కుకున్నాయి. మంగళవారం సాయంత్రం ముంబైలోని ఎలివేటెడ్ ట్రాక్‌పై రెండు రద్దీగా ఉన్న మోనోరైలు స్టేషన్ల మధ్య చిక్కుకున్నాయని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఒక సీనియర్ అధికారి తెలిపారు. దీని కారణంగా కొంతమంది భయాందోళనకు గురైన ప్రయాణికులు నేలపైకి దూకడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.

ప్రజల భయాందోళనలను చూసి అగ్నిమాపక శాఖ కూడా ప్రయాణికులు కిందకు దూకుతారనే భయంతో నేలపై జంపింగ్ షీట్లు వేసిందని, కానీ అలాంటి పరిస్థితి తలెత్తలేదని, ప్రయాణికులందరినీ సురక్షితంగా రక్షించామని ఆయన అన్నారు. భారీ వర్షాల కారణంగా మంగళవారం సాయంత్రం రెండు మోనోరైల్ రైళ్లు ఎలివేటెడ్ ట్రాక్‌పై చిక్కుకున్నాయని, అందులో చాలా మంది ప్రయాణిస్తున్నారని ఆయన అన్నారు. రైళ్లు చిక్కుకుపోవడంతో అక్కడ చాలా గందరగోళం నెలకొంది. దీని తర్వాత సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మోనోరైల్ లోపల ఏసీ ఆగిపోవడం వల్ల డజనుకు పైగా ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. కొంతమంది ప్రయాణికులు మూర్ఛపోయారు. అయితే ఒక ప్రయాణీకుడిని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందని.. అతని పరిస్థితి స్థిరంగా ఉందని చెబుతున్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మైసూర్ కాలనీ, భక్తి పార్క్ మధ్య చిక్కుకున్న మోనోరైల్ రైలు నుంచి 582 మంది ప్రయాణికులను స్నార్కెల్ నిచ్చెన ఉపయోగించి సురక్షితంగా రక్షించారు. మరో 200 మంది ప్రయాణికులను సమీపంలోని వాడాలా స్టేషన్‌కు తిరిగి తీసుకుని వెళ్లి..మరొక మోనోరైల్ రైలు ద్వారా తరలించారు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న ముంబై అగ్నిమాపక దళం చీఫ్ రవీంద్ర అంబుల్గేకర్ మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో తూర్పు ముంబైలోని మోనోరైల్ స్టేషన్‌కు చేరుకున్నారు. వార్తా సంస్థ పిటిఐతో మాట్లాడుతూ, అగ్నిమాపక దళం ధైర్యంగా, జాగ్రత్తగా సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి రెండు మోనోరైల్ రైళ్లలోని 780 మందికి పైగా వ్యక్తులను రక్షించిందని ఆయన అన్నారు.

జంపింగ్ షీట్ వేయబడింది ట్రైన్ లో చిక్కుకున్న ప్రయాణికులు భయపడ్డారు. వారిలో కొందరు ట్రైన్ నుంచి దూకడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా దూకితే వారికి గాయాలు కాకుండా ఉండేలా మేము వెంటనే ట్రాక్‌ల క్రింద నేలపై జంపింగ్ షీట్‌లను వేశాము . వారిని శాంతింపజేయడానికి కోచ్‌లో అధికారులను నియమించాము. అటువంటి భయాందోళన సంఘటన విషాదంగా మారకుండా నిరోధించడానికి మేము ప్రాధాన్యత” ఇచ్చామని ఆయన అన్నారు.

గత 2 రోజులుగా ముంబైలో కుండపోత వర్షాల కారణంగా హార్బర్ లైన్‌లో సబర్బన్ రైలు సర్వీసులు నిలిచిపోయడంతో చాలా మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా మోనోరైలు వైపు మొగ్గు చూపారు. కానీ సాయంత్రం 6 గంటల తర్వాత రద్దీ సమయాల్లో మైసూర్ కాలనీ సమీపంలో ఒక మోనోరైలు రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఒక వైపుకు వంగి మరొకటి వాడాలా వంతెన దగ్గర కనిపించింది.

కిటికీలను పగలగొట్టి.. ప్రయాణీకులను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది ముంబై అగ్నిమాపక దళానికి మోనోరైల్ ప్రయాణికులను రక్షించడంలో గతంలో అనుభవం ఉన్నందున, వారు వెంటనే అగ్నిమాపక యంత్రాలు , అనేక అంబులెన్స్‌లను వైమానిక నిచ్చెనలతో పాటు అవసరమైన అత్యవసర పరికరాలతో సంఘటనా స్థలానికి తరలించారు. “రెస్క్యూ బృందం మోనోరైల్ కిటికీలను పగలగొట్టి ప్రయాణీకులను రక్షించడానికి తలుపులు తెరిచింది, మొదట మహిళలు, సీనియర్ సిటిజన్లను తరలించారు. చివరగా యువతకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆ ప్రయాణీకులకు అక్కడికక్కడే వైద్య సహాయం కూడా అందించబడింది” అని ఆయన చెప్పారు.

రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో రెండు మోనోరైల్ రైళ్ల నుంచి మొత్తం 782 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. రక్షించబడిన వారిలో కొంతమంది పరిస్థితి బాగాలేదని, వారికి వైద్య సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అదే సమయంలో మైసూర్ కాలనీ మోనోరైల్ నుంచి రక్షించబడిన 582 మంది ప్రయాణికులలో 23 మందికి ఊపిరాడక లక్షణాలు కనిపించాయని, 108 అంబులెన్స్‌లో ఉన్న వైద్యుడు వెంటనే వారికి చికిత్స అందించి, తరువాత వారిని డిశ్చార్జ్ చేశారని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..