AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పరీక్ష రాస్తూ నిద్రపోయిన విద్యార్థి.. ఆకట్టుకున్న టీచర్ రియాక్షన్.. ఇదే అందమైన క్షణం అంటున్న నెటిజన్లు

కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా చదువు విషయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి స్టూడెంట్ పరీక్షలో మంచి మార్కులను సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు. దీంతో శక్తికి మించి శ్రమ పడుతున్నారు. ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ కి సంబందించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఎగ్జామ్ రాస్తున్న సమయంలో ఒక స్టూడెంట్ నిద్రపోతున్నాడు. ఆ సమయంలో టీచర్ స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది.

Viral Video: పరీక్ష రాస్తూ నిద్రపోయిన విద్యార్థి.. ఆకట్టుకున్న టీచర్ రియాక్షన్.. ఇదే అందమైన క్షణం అంటున్న నెటిజన్లు
Teacher And Student Video
Surya Kala
|

Updated on: Aug 20, 2025 | 11:57 AM

Share

ఒడిశాకు చెందిన ఒక ఉపాధ్యాయుడి వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ క్లిప్ చూసిన తర్వాత నెటిజన్లు దీనిని ‘ఎప్పటికైనా ఇదే అత్యంత అందమైన పరీక్ష క్షణం’ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష జరుగుతున్న సమయంలో ఒక విద్యార్థి డెస్క్ మీద నిద్రపోయాడు. అప్పుడు ప్రభాత్ కుమార్ ప్రధాన్ అనే ఉపాధ్యాయుడు ప్రతిస్పందించిన తీరు చాలా విలువైనది.

ఈ వైరల్ వీడియోలో పరీక్ష జరుగుతుండగా, ఒక విద్యార్థి డెస్క్ మీద తల పెట్టుకుని నిద్రపోతున్నట్లు మీరు చూడవచ్చు. ఆ బాలుడి అన్సార్ షీట్ , పేపర్స్ అన్నీ ముందు ముందు పడి ఉన్నాయి. అప్పుడు ఉపాధ్యాయుడు ప్రభాత్ కుమార్ నెమ్మదిగా ఆ స్టూడెంట్ దగ్గరకు వెళ్లి.. బాలుడి వీపును ప్రేమగా తడుముతూ మేల్కొలుపుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఆ బాలుడు అకస్మాత్తుగా మేల్కొని చుట్టూ చూడగానే, తరగతి మొత్తం నవ్వడం ప్రారంభించింది. ఇది చూసి, టీచర్ కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నాడు. ఈ వీడియోను ప్రభాత్ సర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @sir__prabhat_ నుంచి షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు లక్షలాది మంచి చూశారు. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ స్పందిస్తున్నారు.

ఇక్కడ వీడియో చూడండి

‘చదువు ఒత్తిడి + నిద్ర లేమి’

ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు చదువు ఒత్తిడి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. చదువు ఒత్తిడి + నిద్రలేమి = పరీక్షలో అత్యంత అందమైన క్షణం అని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇలాంటి టీచర్ ప్రతి చోటా ఉంటే ప్రతిదీ అదుపులో ఉంటుందని చెప్పారు. మరొకరు ఆ స్టూడెంట్ ని తిట్టడానికి బదులుగా.. టీచర్ స్పందించిన తీరు.. అతను నవ్వు అందరి హృదయాలను గెలుచుకుకుందని కామెంట్ చేయగా.. పరీక్షా హాలులో ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయని అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?
త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. విజయ్ అలా ప్లాన్ చేశారా?
త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. విజయ్ అలా ప్లాన్ చేశారా?