AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: నదిలో స్కూబా డైవింగ్ చేస్తుండగా మహిళకు కనిపించిన 100 ఏళ్ల నాటి సీసా.. దాని లోపల

సాధారణమైన డైవ్‌ ఒక అద్భుతమైన అనుభూతిగా మారింది. అమెరికాలోని మిషిగన్‌లో చెబోయ్‌గన్‌ నదిలో స్కూబా డైవర్‌ జెనిఫర్‌ డౌకర్‌కి దాదాపు వందేళ్ల నాటి సీసాలో రాసిన సందేశం దొరికింది. 1926లో రాసిన ఆ చీటి, ఆశ్చర్యకరంగా ఇప్పుడు బయటపడింది. ఇంతకీ అందులో ఏం రాసి ఉందంటే..?

Viral: నదిలో స్కూబా డైవింగ్ చేస్తుండగా మహిళకు కనిపించిన 100 ఏళ్ల నాటి సీసా.. దాని లోపల
Scuba Diver
Ram Naramaneni
|

Updated on: Aug 20, 2025 | 3:37 PM

Share

రోజూ చేసే పనులు ఒక్కోసారి ఊహించని అనుభవాలుగా మారిపోతాయి. ఓ పుస్తకంలో దాచిన చీటీ, బాల్యంలో ముద్దుగా చూసుకున్న ఆటబొమ్మ, ఆల్మరాలో దొరికిన పాత లేఖ.. ఇలా సాధారణమైన చోట్ల అసాధారణమైన కథలు దాగి ఉంటాయి. అలాంటిదే ఒక అనుభవం మిచిగన్ రాష్ట్రానికి చెందిన స్కూబా డైవర్ జెన్నిఫర్ డౌకర్‌కు ఎదురైంది. తన గ్లాస్ బాటమ్ బోటును శుభ్రం చేస్తూ, షిబాయగన్ నదిలో డైవ్ చేసిన జెన్నిఫర్‌కి ఒక పచ్చ బాటిల్ కనిపించింది. మొదట అది సాధారణ బాటిల్ అనుకుంది. దగ్గరగా వెళ్లి తీసుకున్నాక లోపల పేపర్ కనిపించడంతో ఆశ్చర్యపోయింది. జాగ్రత్తగా బయటికి తీసి చదివితే.. అది 1926 నవంబర్‌లో రాసిన లేఖ అని తెలిసింది. “ఈ బాటిల్ ఎవరికైనా దొరికితే, దాన్ని చెబోయగన్‌లోని జార్జ్ మోరోకు తిరిగి ఇవ్వండి. ఎక్కడ దొరికిందో కూడా చెప్పండి” అని ఆ లేఖలో రాసి ఉంది.

Note

ఈ ఆశ్చర్యకర ఘటనతో థ్రిల్ ఫీల్ అయిన జెన్నిఫర్, ఫేస్‌బుక్‌లో ఫోటోలు షేర్ చేసింది. ఒక్కరోజులోనే ఆ పోస్ట్ వైరల్ అయి, లక్షలాది షేర్లు, కామెంట్లు వచ్చాయి. ఆ లేఖ ఎవరు రాసారో వెతకడం మొదలైంది. అంతలోనే జెన్నిఫర్‌కి ఒక కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది మిచెల్ ప్రిమో. లేఖ రాసిన జార్జ్ మోరో కూతురు. ఆమె తండ్రి హ్యాండ్‌రైటింగ్ అని వెంటనే గుర్తుపట్టింది. లేఖ ఆమె పుట్టకముందే రాసినది అయినా.. వెంటనే గుర్తించగలిగింది. జెన్నిఫర్ ఆ బాటిల్, లేఖను మిచెల్‌కు తిరిగి ఇవ్వాలని అనుకుంది. అయితే, మిచెల్ మాత్రం ఆ లేఖను జెన్నిఫర్ వద్దే ఉంచుకోవాలని సూచించింది. అందరికీ గుర్తుండేలా బోటులో ప్రదర్శనగా పెట్టమని కోరింది. దాంతో జెన్నిఫర్ ఆ బాటిల్, లేఖను ఫ్రేమ్ చేసి తన ఆఫీస్‌లో అమర్చింది.

అలా… ఓ సాధారణ డైవ్ ఒక 100 ఏళ్ల క్రితం రాసిన మెసేజ్‌ను వెలుగులోకి తెచ్చింది. ఒక బాటిల్‌లోని చిన్న లేఖ, రెండు కుటుంబాలను కలిపింది. సాధారణమైన సందేశం కూడా ఎంత పెద్ద కథ చెబుతుందో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్