Watch: ఇదో వింత ఆచారం.. దరిద్ర దేవతను వెళ్లగొట్టిన ఖానాపూర్.. సుఖ సంతోషాల కోసం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ..

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో దరిద్ర దేవత (జెట్టక్క) ను తరిమికొట్టి, లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రాచీన ఆచారాన్ని గ్రామస్తులు ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. పాత చీపుర్లు, చాటలతో ఊరంతా ఊరేగుతూ, దరిద్రం దూరమై సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటారు. ఈ వింత సంప్రదాయం ద్వారా వ్యక్తిగత, గ్రామీణ సమస్యలు తొలగిపోతాయని వారి నమ్మకం.

Watch: ఇదో వింత ఆచారం.. దరిద్ర దేవతను వెళ్లగొట్టిన ఖానాపూర్.. సుఖ సంతోషాల కోసం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ..
Khanapur Jettakka Ritual

Edited By: Jyothi Gadda

Updated on: Nov 09, 2025 | 9:37 AM

చేతిలో పాత చీపుర్లు.. చాటలు.. ఒంటి నిండా పాత బట్టలు.. ముఖం నిండా నల్లని బూడిద డప్పుల దరువులు.. పాత చిపుర్లతో కొట్టుకుంటూ సాగుతున్న ర్యాలీ.. ఏంటీ ఈ వింత ఆచారం అనుకుంటున్నారా.. దరిద్ర దేవతను‌ సాగనంపే తరతరాల ఆచారం ఇది. అంతరించిపోయిన జాబితాలో చేరి పోయిన ఆతరం ఆచారం ఇది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో తలుక్కున మెరిసింది.

జెట్టక్క వెళ్లిపో.. పో వెళ్లిపో.. లక్ష్మీదేవరా రా మా ఊర్లోకి త్వరగా రా అంటూ.. గ్రామశివారు వరకు ర్యాలీ తీశారు ఖానాపూర్ వాసులు. జెట్టక్క ( దరిద్ర దేవత ) వెళ్లి పోవాలని ప్రతి ఇంటిలో నుండి పాత దుస్తులు వేసుకొని పాత చీపుర్లు, పాత చాటలతో కొట్టుకుంటూ గల్లీ‌గల్లీలో ర్యాలీ తీశారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గ్రామస్థులంతా కలిసి దరిద్ర దేవతను వెళ్లగొట్టే జెట్టక్క కార్యక్రమంలో పాల్గొన్నారు‌. చిన్న పెద్దలతో కలిసి పాత దుస్తులు వేసుకొని పాత చీపుర్లు, చాటలతో ఒకరినొకరు కొట్టుకుంటూ పొలిమేర్ల వరకు జెట్టక్క వెళ్లిపో లక్షిదేవి రా అంటూ నృత్యాలు చేస్తూ గ్రామ పొలిమేర్లకు ర్యాలీగా బయలుదేరారు. గ్రామానికి పట్టిన దరిద్రం పోయి.. శని తొలగిపోయి ఏడాదంతా ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని, దీర్ఘ కాలిక సమస్యలు‌అదుపులోకి రావాలని కోరుకున్నారు. అంతరించిపోయిన జాబితాలో చేరిపోయిన ఈ వింత ఆచారాన్ని పట్టణ వాసులంతా ఘనంగా జరుపుకున్నారు. ఇలా చేస్తే ఇంట్లో ని దరిద్రమే కాదు ఒంట్లోని ఊరిలోని దరిద్రం కూడా దూరం అవుతుందని నమ్ముతాం అని చెప్తున్నారు ఖా‌నాపూర్ వాసులు. జెట్టక్క మళ్లీ రాకక్కో అంటూ గుడ్ బై చెప్పేసి పుణ్య స్నానాలు‌ ఆచారించారు వీరంతా.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..