Viral: కేజీ రూ.3,600.. ఇవి ఏం చేపలో తెలుసా..? ఈ రెండు కొనాలంటే అప్పు చేయాల్సిందే
మత్స్యకారులు చేపలు పట్టేందుకు ఎప్పటిలానే సముద్రంలోకి వెళ్లారు.. వేట కొనసాగించి ఒడ్డుకు చేరుకున్నారు.. అయితే.. చేపలు ఒడ్డుకు తెచ్చి విక్రయించేందుకు పని మొదలు పెట్టారు.. ఈ క్రమంలోనే.. రెండు అరుదైన చేపలు జాలర్లకు కనిపించాయి.. వాటిని వేలం వేయగా.. లక్షన్నర ధర పలికింది..

మత్స్యకారులు చేపలు పట్టేందుకు ఎప్పటిలానే సముద్రంలోకి వెళ్లారు.. వేట కొనసాగించి ఒడ్డుకు చేరుకున్నారు.. అయితే.. చేపలు ఒడ్డుకు తెచ్చి విక్రయించేందుకు పని మొదలు పెట్టారు.. ఈ క్రమంలోనే.. రెండు అరుదైన చేపలు జాలర్లకు కనిపించాయి.. వాటిని వేలం వేయగా.. లక్షన్నర ధర పలికింది.. దీంతో జాలర్ల పంటపండింది.. అయితే.. ఆ చిక్కిన చేపలు రెండు ఔషధ చేపలని.. అందుకే అంత ధర పలికిందని మత్స్యకారులు తెలిపారు. ఈ ఘటన తమిళనాడు తీర ప్రాంతంలో చోటుచేసుకుంది.
రామేశ్వరం సమీపంలోని పంబన్ దక్షిణ వాడి ఓడరేవు ప్రాంతం నుంచి 80 కి పైగా పడవల్లో 600 మందికి పైగా మత్స్యకారులు దక్షిణ సముద్ర ప్రాంతంలోని మన్నార్ గల్ఫ్‌లో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ మత్స్యకారులందరూ నిన్న ఉదయం సీల, మౌలా, పారా – విలి వంటి వివిధ రకాల చేపలతో ఒడ్డుకు తిరిగి వచ్చారు.
ఇందులో రెండు పెద్ద క్యాట్ ఫిష్ లు ఒక ఫిషింగ్ బోట్ వలలో చిక్కుకున్నాయి. ఒక చేప 22 కిలోలు, మరొకటి 24 కిలోలు బరువు ఉంది. ఈ రెండు చేపలు కిలో రూ.3,600 చొప్పున మొత్తం రూ.1 లక్ష 65 వేలకు అమ్ముడుపోవడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తంచేశారు.
“కోరల్ చేప (koral fish) ను ఆహారం కోసం ఉపయోగించరు. ఈ చేప కడుపులో కొంత భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఖరీదైన సూప్ తయారు చేయడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు” అని మత్స్యకారులు తెలిపారు. ఇవి అరుదుగా లభిస్తాయని పేర్కొంటున్నారు.
హిల్సా, కోరల్ – రుప్చండ వంటి ఉప్పునీటి చేపలు ఒమేగా-3ల కారణంగా గుండె, మెదడు – కంటి ఆరోగ్యానికి సహాయపడతాయని.. అంతేకాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తాయని పేర్కొంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
