AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వాహనదారులకు షాకింగ్‌ న్యూస్.. భారీ శబ్దాలతో హారన్‌ కొడుతున్న డ్రైవర్లకు.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు

రోడ్లపై ఇష్టమున్నట్లు వాహనాలను నడిపిస్తూ..ఎదుటి వారి చెవులు చిల్లుపడేలా హరన్ లు కొడుతూ... ఇతరులకు ఇబ్బందులు కలిగించే వారికి పోలీసులు గువ్వ గుయ్యిమనే గుణపాఠం చెప్పారు. వీరు  అదే పనిగా హరన్ లు మోగిస్తూ రోడ్డుపై వెళ్లే పా దాచారులు, టూవీర్ వాహనదారులు ఎలా ఇబ్బంది పడుతుంటారో తెలియజేయాలనుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, అదే పనిగా హారన్‌లు కొడుతున్న

Viral Video: వాహనదారులకు షాకింగ్‌ న్యూస్.. భారీ శబ్దాలతో హారన్‌ కొడుతున్న డ్రైవర్లకు.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు
Police Punishes Driver
Jyothi Gadda
|

Updated on: Jan 21, 2025 | 6:25 PM

Share

భారతదేశ రహదారులపై మనం తరచుగా హారన్ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక్కడి డ్రైవర్లలో అసహనం ఎక్కువని చాలా సార్లు అనిపిస్తోంది. వాహనం ఒక్క సెకను ఆగితే కూడా వెనకాల వచ్చే వాహనదారులు హారన్ మోగించి చంపేస్తుంటారు.. చాలా సార్లు విదేశీ పర్యాటకులు కూడా ఈ హారన్ మోత గురించి ఫిర్యాదు చేస్తుంటారు. ఇదిలా ఉంటే కర్ణాటకకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కర్నాటకలో హారన్‌లు కొట్టే వారికి పోలీసులు వెరైటీ శిక్ష విధించారు. బిగ్గరగా హారన్‌లు మోగించే డ్రైవర్లు తమ హారన్‌లను తమకే వినిపించేలా చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్‌ వీడియోలో కర్ణాటక పోలీసులు తీసుకున్న నిర్ణయం ఇంటర్‌నెట్‌లో చర్చనీయాంశంగా మారింది. రోడ్లపై ఇష్టమున్నట్లు వాహనాలను నడిపిస్తూ..ఎదుటి వారి చెవులు చిల్లుపడేలా హరన్ లు కొడుతూ… ఇతరులకు ఇబ్బందులు కలిగించే వారికి పోలీసులు గువ్వ గుయ్యిమనే గుణపాఠం చెప్పారు. వీరు  అదే పనిగా హరన్ లు మోగిస్తూ రోడ్డుపై వెళ్లే పా దాచారులు, టూవీర్ వాహనదారులు ఎలా ఇబ్బంది పడుతుంటారో తెలియజేయాలనుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, అదే పనిగా హారన్‌లు కొడుతున్న కొంత మంది డ్రైవర్ లకు వెరైటీగా పనిష్మెంట్ ఇచ్చారు. వీళ్లు ఏవిధంగా అయితే.. భారీ శబ్దాలు చేసి ఇతరులను చిరాకు పెట్టించారో..అదే విధంగా వీళ్లను కూడా.. పెద్దగా హరన్ లను మోగించి.. దాని ముందు వీళ్లను కూర్చొబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్‌నెట్‌లో వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు. గతంలో ఇలా హారన్‌ మోతాలతో ఇబ్బందులు పడ్డ పలువురు తమ అనుభవాలను షేర్‌ చేసుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..