Viral Video: జిరాఫీ పిల్లపై కన్నేసిన సింహాలు.. పోరాడి ఓడిన తల్లి జిరాఫీ.. వీడియో వైరల్‌

Heart Touching Video: సృష్టిలో కల్మషం లేనిది తల్లి ప్రేమ ఒక్కటే.. ఇది కేవలం మనుషులకే కాదు పశుపక్ష్యాదులకూ వర్తిస్తుంది. ఎందుకంటే తల్లి ప్రేమ బిడ్డకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది..

Viral Video: జిరాఫీ పిల్లపై కన్నేసిన సింహాలు.. పోరాడి ఓడిన తల్లి జిరాఫీ.. వీడియో వైరల్‌
Battle Between Lioness And
Follow us
Surya Kala

|

Updated on: Jan 03, 2022 | 2:56 PM

Heart Touching Video: సృష్టిలో కల్మషం లేనిది తల్లి ప్రేమ ఒక్కటే.. ఇది కేవలం మనుషులకే కాదు పశుపక్ష్యాదులకూ వర్తిస్తుంది. ఎందుకంటే తల్లి ప్రేమ బిడ్డకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. అలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో అప్పుడే పుట్టిన ఒక జిరాఫీ పిల్లను కొన్ని హైనాలు, సింహాలు టార్గెట్‌ చేశాయి. అయితే హైనాలు మధ్యలో వెళ్లిపోయాయి.. కానీ సింహాలు మాత్రం వదల్లేదు. అది గమనించిన తల్లి జిరాఫీ ఆ సింహాలను బెదిరించి తన బిడ్డను జిరాఫీల గుంపులోకి తీసుకెళ్లింది. కానీ సింహాలు మాత్రం పట్టు వీడలేదు. వాటినే వెంబడించాయి. పాపం ఇంకా అడుగులు కూడా వేయడం రాని ఆ జిరాఫీని కాపాడుకోడానికి ఆ తల్లి జిరాఫీ ఎంతగానో ప్రయత్నించింది. అలా 6 కి.మీ. వరకూ జిరాఫీలను సింహాలు వెంటాడుతూనే ఉన్నాయి. అలా వెళ్తున్న క్రమంలో ఇంక ముందుకు వెళ్లేందుకు దారి కనబడలేదు జిరాఫీలకి.

సింహం నుంచి బిడ్డను ఎలా కాపాడుకోవాలా అని తల్లి ఆలోచిస్తున్న సమయంలో… పిల్ల జిరాఫీ ఓ గొయ్యిలో పడిపోయింది. దాన్ని కాపాడబోయి తల్లి జిరాఫీ కూడా పడిపోయింది. అదే అదనుగా… సింహం… పిల్ల జిరాఫీపై దాడి చేసింది. ఓ నీటి కొలను పక్కన జీవశ్చవంలా పడి ఉన్న తన బిడ్డదగ్గరకి మళ్లీ వస్తున్న సింహాన్ని తల్లి జిరాఫీ తరిమేసింది. కాసేపటికి అద్భుతం జరిగింది. పిల్ల జిరాఫీ తిరిగి ప్రాణాలతో లేచింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సింహం దాడిలో తీవ్రంగా గాయపడిన బేబీ జిరాఫీ నీటి కొలనులో దిగి చనిపోయింది. కెన్యాలోని మసాయ్ మరాలో ఉన్న ఒలారే మోటోరోగీ కన్సెర్వాన్సీలో.. సఫారీకి వెళ్లిన టూరిస్టుల కంటపడింది ఈ దృశ్యం. ఇదంతా వీడియోతీసి యూట్యూబ్‌లో నవంబరు 24న పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను వీక్షిస్తున్నలక్షలమంది నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో యువతకు ప్రేరణ ఇచ్చింది. ఎప్పుడూ పోరాటాన్ని వదలొద్దు అనే సందేశం ఇచ్చింది” అంటూ ఓ యూజర్ కామెంట్ ఇచ్చారు.

Also Read:   ప్రతిరోజూ ఉదయం మీరు ఇలా మొదలు పెట్టండి.. ఆనందం, సంతోషం, సక్సెస్ మీ వెంటే..