Viral Photo: ఈ ఫోటోలో మంచు చిరుతను కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్.! ట్రై చేయండి..
Viral Photo: ఫోటో పజిల్స్.. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. సాధారణంగా పజిల్స్‌పై మనం ప్రత్యేక దృష్టి పెడతాం...
ఫోటో పజిల్స్.. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. సాధారణంగా పజిల్స్‌పై మనం ప్రత్యేక దృష్టి పెడతాం. ఆ ఫోటోలో ఏముంది.? ఎక్కడ దాగుంది.? కనిపెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తాం. తగ్గేదేలే అన్నట్లుగా పజిల్‌ను సాల్వ్ చేస్తాం. ఇలాంటి ఫన్ కంటెంట్ కోసం కొన్ని పేజీలు ప్రత్యేకంగా ఫోటో పజిల్స్ అప్‌లోడ్ చేస్తుంటాయి. సవాళ్లను స్వీకరించేవారికి ఈ పజిల్స్ ఇట్టే టైం గడిచిపోయేలా చేస్తాయి. గతంలో మనం ఆడుకున్న సుడోకోలు, పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్ మరో ఎత్తు. తాజాగా ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతోంది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి కొండ ప్రాంతంలా కనిపిస్తోన్న ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా మంచు చిరుతలు నివసిస్తుంటాయి. కొండ రంగులో ఆ చిరుత రంగు ఇమిడిపోవడంతో దాన్ని కనిపెట్టడం అంత ఈజీ కాదు. మీ కళ్లకు పదునుంటే చిటికెలో ఈ పజిల్ సాల్వ్ చేసేస్తారు. మరి లేట్ ఎందుకు ట్రై చేయండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.
Here is the answer.. pic.twitter.com/de7dtMlZ9L
— telugufunworld (@telugufunworld) January 3, 2022
ఇదిలా ఉంటే.. మంచు చిరుతలు అరుదైన జాతికి చెందిన జంతువులు. ఇవి ఎక్కువగా కొండలు, పర్వతాలపై తమ జీవనాన్ని సాగిస్తుంటాయి. వాటికీ నీలం రంగు గొర్రెలు ఇష్టమైన ఆహారం అని చెప్పొచ్చు. అలాగే సాయంత్రం వేళ మంచు చిరుతలు వేటాడుతుంటాయి. అవి ఆ సమయంలోనే చురుగ్గా ఉంటాయి.