AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఫారెన్‌ ప్రియురాలితో ఇంటికి వచ్చిన కొడుకు.. కుటుంబ సభ్యుల రియాక్షన్‌ ఎలా ఉందంటే..

స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా సహాయంతో ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో చాలా వీడియోలు విడుదలవుతాయి. వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు ప్రజల హృదయాల్ని కదిలించేవిగా ఉంటే, మరికొన్ని భావోద్వేగభరితంగా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని ఒక కుటుంబ సభ్యులు తమ కొడుకు వెంట తీసుకువచ్చిన విదేశీ స్నేహితురాలిని ఎంతో ఆనందంగా స్వాగతిస్తున్న వీడియో ఇది. ఈ వీడియో చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కాబట్టి, ఆ వీడియోలో జరిగింది ఏమిటి..? ప్రజలు ఎందుకు అంతగా దీనిని ఆదరిస్తున్నారో వివరంగా పరిశీలిద్దాం.

Watch: ఫారెన్‌ ప్రియురాలితో ఇంటికి వచ్చిన కొడుకు.. కుటుంబ సభ్యుల రియాక్షన్‌ ఎలా ఉందంటే..
Family's Joyful Welcome
Jyothi Gadda
|

Updated on: Sep 10, 2025 | 5:16 PM

Share

మానవ జీవితంలో ప్రేమ చాలా ముఖ్యమైన విషయం. ప్రేమ లేకుండా ఏ మానవుడూ ఉండలేడు. అందరు మనుషులు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ప్రేమలో పడతారు. కానీ, భారతదేశానికి సంబంధించినంతవరకు ప్రేమ వివాహాలను కుటుంబాలలో స్వాగతించరు. భారతీయ తల్లిదండ్రులు తమ పిల్లలు ఒకే మతం, కులం, సమాజంలో వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ ప్రేమ వీటన్నింటినీ అధిగమిస్తుంది. ప్రేమను ఏ ఆంక్షలు ఆపలేవు. ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించే తల్లిదండ్రుల మధ్య ఒక కుటుంబం తమ కొడుకు తీసుకువచ్చిన అమెరికన్ స్నేహితురాలిని స్వాగతించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

చాలా మంది ఇళ్లలో పిల్లలు తల్లిదండ్రులతో అంత ఓపెన్ గా ఉండలేరు. స్నేహితులు, లేదంటే, ప్రియుడు, ప్రియురాలిని ఇంట్లో వాళ్లకి పరిచయం చేయలేరు. వారిని పరిచయం చేయడం కాదు.. మనం ఒక సంబంధంలో ఉన్నామని వారికి తెలిస్తే ఏ పేరెంట్స్‌ అంగీకరించరు. కానీ, జమ్మూలో ఒక భారతీయ తల్లిదండ్రులు తమ కొడుకు వెంట తీసుకు వచ్చిన అమెరికన్ స్నేహితురాలిని ఎంతో ప్రేమతో, ఆనందంతో స్వాగతించిన అద్భుతమైన, హృదయాన్ని హత్తుకునే ఘటన కెమెరాలో బంధించబడింది. ఈ అందమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు తన అమెరికన్ స్నేహితురాలిని ఇంటికి తీసుకువస్తున్నాడు. ఆ యువకుడి కుటుంబం మొత్తం వారిని గుమ్మం వద్ద ఘనంగా స్వాగతిస్తుంది. వారు తమ కాబోయే కోడలిని ఎంతో ఆనందంతో హారతి పడుతూ, పూల వర్షం కురిపిస్తున్నారు. స్వీట్లు, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేస్తూ స్వాగతం పలుకుతారు. అది చూసిన విదేశీ మహిళ తన ప్రియుడి కుటుంబం ప్రేమను చూసి ఆనందిస్తుంది. ఇదంతా వీడియోలో రికార్డ్ చేయబడింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా, ప్రతి ఒక్కరికీ ఇలాంటి ప్రేమగల కుటుంబం ఉండాలని చాలామంది తమ అభిప్రాయాలను పంచుకోవడం గమనార్హం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..