ఇకపై కోతులకు ఆహారం పెడితే రూ.5 వేల ఫైన్ కట్టాల్సిందే..!
అంతేకాదు.. ఈ నిషేధంతో స్థానిక ప్రజలు, పర్యాటకులు అందించే ఆహారాన్ని వెతుక్కుంటూ కోతులు పట్టణానికి రాకుండా నిరోధించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలా చేయడం వల్ల కోతులుఅడవులలో తిరుగుతూ ప్రకృతిలో లభించే పండ్లు, కాయలు వంటి సహాజ ఆహారాన్ని వెతుక్కుని తినే వాటి అసలు అలవాటుకు తిరిగి వెళ్లేలా చూడొచ్చు అన్నారు.

డార్జిలింగ్ మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కోతికి ఆహారం తినిపిస్తే పర్యటకుడైనా, సామాన్యుడైనా రూ.5 వేలు జరిమానా కట్టాల్సిందే. శైల్షహర్ అంతటా బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్ర చీఫ్ ఫారెస్టర్ భాస్కర్ మాట్లాడుతూ ‘కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల అడవుల్లో ఆహారం సేకరించే అలవాటును మారుస్తోంది. వాటికి ఆహారం లభించకపోతే దాడి చేస్తాయి. అందుకే డార్జిలింగ్ మున్సిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు.
డార్జిలింగ్ మునిసిపాలిటీ చైర్మన్ దిపెన్ ఠాకూరి ప్రకారం.. మనుషులు, కోతులకు మధ్య దాడులను నివారించడానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. అంతేకాదు.. ఈ నిషేధంతో స్థానిక ప్రజలు, పర్యాటకులు అందించే ఆహారాన్ని వెతుక్కుంటూ కోతులు పట్టణానికి రాకుండా నిరోధించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలా చేయడం వల్ల కోతులుఅడవులలో తిరుగుతూ ప్రకృతిలో లభించే పండ్లు, కాయలు వంటి సహాజ ఆహారాన్ని వెతుక్కుని తినే వాటి అసలు అలవాటుకు తిరిగి వెళ్లేలా చూడొచ్చు అన్నారు.
వాటికి ఆహారం ఇవ్వకపోతే, అవి కూడా కొరుకుతాయి. డార్జిలింగ్ అంతటా రేబిస్ సంఖ్య పెరిగింది. కాబట్టి మేం ఒక తీర్మానాన్ని ఆమోదించి దానిని తప్పనిసరి చేస్తున్నామని ఠాకూరి వెల్లడించారు. కొన్ని సంవత్సరాల క్రితం సమీపంలోని అడవి నుండి పట్టణ ప్రాంతానికి కోతులు వచ్చేవి కాదని మునిసిపాలిటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు మాత్రమే కొన్ని కోతులు కనిపించేవని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




