అదృష్టం వరించింది..! 333 కిలోల గణేశ్ లడ్డూ.. రూ.99కే దక్కించుకున్న విద్యార్థి.. ఎక్కడంటే..
సాధారణంగా గణేశ్ లడ్డూలను వేలం వేసినప్పుడు లక్షల రూపాయల వరకు ధరలు పెరుగుతాయి. బాలాపూర్ లడ్డూ 35 లక్షలు ధర పలికితే, నగర శివార్లలోని రిచ్‌మండ్ విల్లాలో గణనాథుడి లడ్డూ ఏకంగా రూ.2.32 కోట్లకు లడ్డూను దక్కించుకున్నారు. ఒకపక్క కోట్లు, లక్షల రూపాయలకు వేలం వేసే గణేశ్ లడ్డూల వార్తలు వైరల్ అవుతుంటే మరోపక్క కేవలం రూ.99కే 333 కిలోల భారీ లడ్డూ గెలుచుకోవటంతో ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

గణపతి నవరాత్రులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు భక్తులు. కానీ, ఈ ఉత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టం మన తెలంగాణ హైదరాబాద్‌లోనే కనిపిస్తుంది. అదేంటంటే…ఒకటి బడా గణేష్ మహారాజ్, రెండు బాలాపూర్ గణపతి లడ్డూ వేలం…అవును.. ఈ రెండు మన హైదరాబాద్ వినాయక ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపును తెచ్చాయి. బాలాపూర్ వినాయకుడి చేతిలో ఉండే లడ్డూ ఏ యేటికి ఆ యేడు రికార్డులను బద్దలు కొడుతూ భారీ ధర పలుకుతోంది. ఈసారి కూడా అంచనాలను అందుకుంటూ రికార్డు ధర పలికింది.
గత ఏడాది రికార్డులను బద్దలు కొడుతూ వేలంలో ఏకంగా 35 లక్షలు ధర పలికింది. నగర శివార్లలోని రిచ్‌మండ్ విల్లాలో గణనాథుడి లడ్డుకు రికార్డు ధర పలికింది. విల్లా సభ్యులు ఏకంగా రూ.2.32 కోట్లకు లడ్డూను దక్కించుకున్నారు. ఇంతటీ క్రేజ్ ఉన్న వినాయకుడి చేతిలో ఉండే లడ్డూను ఓ విద్యార్థి కేవలం 99రూపాయలకే దక్కించుకున్నాడు. అటు, రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో రూ. 51.77 లక్షలు పలుకగా,
వీడియో ఇక్కడ చూడండి..
హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రుల సందడి కొనసాగుతున్న వేళ కొత్తపేటలో ఒక డిగ్రీ విద్యార్థి అదృష్టం అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీ ఏకదంత యూత్ అసోసియేషన్ నిర్వహించిన లక్కీ డ్రాలో 760 టోకెన్లు విక్రయించగా, బీబీఏ విద్యార్థి సాక్షిత్ గౌడ్ విజేతగా నిలిచాడు. ఒకపక్క కోట్లు, లక్షల రూపాయలకు వేలం వేసే గణేశ్ లడ్డూల వార్తలు వైరల్ అవుతుంటే మరోపక్క కేవలం రూ.99కే 333 కిలోల భారీ లడ్డూ గెలుచుకోవటంతో ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
