AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధైర్యముంటేనే చూడండి.! కోబ్రాను సజీవంగా తిన్న కోడి.. చూస్తే దడుసుకుంటారు!

కింగ్ కోబ్రా-కోడికి సంబంధించి షాకింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నిజంగా షాకింగ్‌కు గురి చేసింది. ఎందుకంటే ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కింగ్ కోబ్రా లాంటి ప్రమాదకరమైన పామును కోడి సైతం వేటాడగలదని నెటిజన్లు నమ్మలేకపోతున్నారు. దాడి చేసిన కోబ్రాను వెంటాడి వేటాడింది కోడి.

ధైర్యముంటేనే చూడండి.! కోబ్రాను సజీవంగా తిన్న కోడి.. చూస్తే దడుసుకుంటారు!
Hen Vs Cobra
Balaraju Goud
|

Updated on: Sep 10, 2025 | 5:26 PM

Share

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటైన కింగ్ కోబ్రా, రెండు కోళ్ల మధ్య జరిగిన షాకింగ్ ఫైట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. సాధారణంగా, మనుషులే కాదు జంతువులు కూడా పాములను చూసినప్పుడు భయంతో పారిపోతాయి. కానీ ఈ వైరల్ వీడియోలో ఏమి జరిగిందో చూసిన తర్వాత, నెటిజన్లు తమ కళ్ళను నమ్మలేకపోతున్నారు.

ఈ వైరల్ వీడియోలో, ఒక పిల్ల నాగు పాము తన పడగను విప్పి రోడ్డుపై కూర్చుంది. బుసలు కొడుతూ హడలెత్తించింది. అప్పుడే రెండు కోళ్లు దానికి చాలా దగ్గరగా వచ్చాయి. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో, ఆ చిన్న నాగుపాము బుసలు కొడుతూ కోళ్లపై దాడి చేసింది. కానీ కోళ్లు ఎటువంటి భయం లేకుండా దానిపై ఎదురు దాడికి దిగాయి. ఆ చిన్న నాగుపాము కోళ్ల ముందు నిస్సహాయంగా ఉండిపోయింది.

ఈ వీడియోలో, రెండు కోళ్ళు కలిసి ఆ చిన్న నాగు పాముపై దాడికి తెగబడ్డాయి. నోటితో కొరికేశాయి.దీని తరువాత, అవి పామును నేలపై రుద్ది మింగేశాయి. ఈ వీడియో నిజంగా షాకింగ్ గా ఉంది. ఎందుకంటే అలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @vlogger_aditya_06 అనే ఖాతాలో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 35 లక్షలకు పైగా వీక్షించారు. నాగు పాము లాంటి ప్రమాదకరమైన పాములను కోళ్లు వేటాడగలవని నమ్మడం సోషల్ మీడియా వినియోగదారులకు కష్టంగా ఉంది.

వీడియోను ఇక్కడ చూడండి!

గమనిక: ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా రూపొందించింది. ఈ వీడియో ప్రామాణికతను TV9 నిర్ధారించలేదు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..