Viral Photo: ముద్దులతో రెచ్చిపోతున్న ప్రేమజంటలు.. వారికి చెక్ పెట్టేందుకు కాలనీ వాసుల వినూత్న ప్రయత్నం.. చూస్తే షాక్ అవుతారు..
Viral Photo: మీరు ఇప్పటి వరకు చాలా చోట్ల ‘నో హార్న్’ బోర్డు చూసింటారు. ‘నో పార్కింగ్ జోన్’ అని రాయడం చూసుంటారు. ‘నో పార్కింగ్ ..
Viral Photo: మీరు ఇప్పటి వరకు చాలా చోట్ల ‘నో హార్న్’ బోర్డు చూసింటారు. ‘నో పార్కింగ్ జోన్’ అని రాయడం చూసుంటారు. ‘నో పార్కింగ్ జోన్’ బోర్డులను కూడా చూసుంటారు. కానీ, ‘నో కిస్సింగ్ జోన్’ అని రాసి ఉండటం ఎప్పుడైనా చూశారా? పోనీ.. అలా రాస్తారని కలలోనైనా ఆలోచించి ఉంటారా?.. పక్కా అలా చూసిఉండరు.. ఆలోచించి ఉండరు. అయితే, ఇప్పుడు ఆ బోర్డును కూడా చూసేయండి. అవునండీ.. నిజంగా ‘నో కిస్సింగ్ జోన్’ ఏరియా ఉంది. అయితే, ఇది మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ముంబైలోని బోరివాలి ప్రాంతంలో రోడ్ సైడ్ పార్కింగ్ ప్లేస్ వద్ద రోడ్డుపై ‘నో కిస్సింగ్ జోన్’ అని పెద్దగా రాశారు. అది చూసి పాదాచారులు షాక్ అవుతున్నారు. ఎందుకిలా రాశారని అడిగితే.. వారు చెప్పిన సమాధానం విని ముక్కున వేలేసుకుంటున్నారు. వారే కాదు.. మ్యాటర్ తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.
ముంబైలోని బోరివాలి జాగర్స్ పార్క్‌లో ప్రజలు వాకింగ్ కోసం వస్తూ ఉంటారు. అలాగే ప్రేమ జంటలు కూడా వస్తుంటారు. అలా వచ్చిన ఆ జంటలు ఊరుకుంటారా అంటే అదీ లేదు. రెచ్చిపోయి పబ్లిక్‌గానే సరసాలు ఆడుతుంటారు. చుట్టుపక్కన వారు చూస్తున్నారనే బిడియం, భయం ఏదీ లేకుండా రెచ్చిపోతుంటారు. ముద్దులు పెట్టుకోవడం, హగ్స్ ఇచ్చుకోవడం వంటి పనులు చేస్తుంటారు. అయితే, ఈ చర్యలు స్థానిక కాలనీ వాసులకు ఇబ్బందిగా మారింది. ఇంటి బయట కూర్చోవాలన్నా.. బాల్కనీలో నిలబడాలన్నా గిల్టీగా ఫీల్ అయ్యేవారు. ఇక లాభం లేదనుకుని కాలనీ వాసులంతా ఏకమయ్యారు. ఎలాగైనా ఈ ప్రేమ జంటల బహిరంగ సరసాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నారు. వీరి ప్రవర్తనతో కాలనీ సంస్కృతి కూడా చెడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ఒకరోజు కాలనీ ప్రజలంతా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో, ప్రజలు జాతీయ, అంతర్జాతీయ నిపుణుల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతున్నట్లుగా తీవ్రస్థాయిలో సమాలోచనలు జరిపారు. చివరికి విశృంఖలంగా ప్రవర్తిస్తున్న ప్రేమ జంటలకు చెక్ పెట్టేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. ఆ ప్లాన్‌ను వెంటనే అమలు చేశారు. అది చూసి ప్రేమ జంటలు బిత్తరపోయారు. పార్క్ బయట పార్కింగ్ రహదారిపై ‘నో కిస్కింగ్ జోన్’(ఇక్కడ ముద్దులు నిషేధం) అంటూ ఇండికేషన్ రాశారు. పసుపు రంగుతో ‘నో కిస్సింగ్ జోన్’ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రోడ్డును నింపేశారు. దాంతో పాటు.. పార్క్ చుట్టూ ‘నో కిస్సింగ్ జోన్’ అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఎవరైనా అతిక్రమించి ముద్దులు పెట్టుకున్నా.. రొమాన్స్ చేసినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు. కాలనీ వాసుల చర్యతో ప్రేమజంటలు షాక్ అయ్యారు. ‘నో కిస్సింగ్ జోన్’ వార్నింగ్‌ను చూసి మొదట అవాక్కైన ప్రేమ జంటలు.. ఆ తరువాత నిట్టూర్చారు. అయితే, ఈ చర్య తరువాత అక్కడ పరిస్థితులు మెరుగైనట్లు స్థానికులు చెబుతున్నారు.
Also read:
పోర్నోగ్రఫీ కేసులో తిరగబడిన శిల్పా శెట్టి..!మీడియాపై ఫైర్ అయినా హీరోయిన్..:Pornography case Video.