Viral: పెళ్లైన ఇంకా జరగని ఫస్ట్‌నైట్.. కట్ చేస్తే.. భార్య గురించి వెలుగులోకి షాకింగ్ నిజం.!
పెళ్లి కోసం ఎన్నో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో తన ప్రొఫైల్ అప్‌లోడ్ చేశాడు సదరు వ్యక్తి. ఎట్టకేలకు ఓ మహిళ ఓకే చెప్పడంతో 2022 నవంబర్‌లో వివాహం జరిగింది. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే పెళ్లి జరిగి నెల గడుస్తున్నా.. ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు. భర్తను దూరం పెడుతూనే వచ్చింది సదరు మహిళ.

పెళ్లి కోసం ఎన్నో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో తన ప్రొఫైల్ అప్‌లోడ్ చేశాడు సదరు వ్యక్తి. ఎట్టకేలకు ఓ మహిళ ఓకే చెప్పడంతో 2022 నవంబర్‌లో వివాహం జరిగింది. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే పెళ్లి జరిగి నెల గడుస్తున్నా.. ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు. భర్తను దూరం పెడుతూనే వచ్చింది సదరు మహిళ. ఇలాంటి సందర్భంలో ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్.. భర్తకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇంతకీ అదేంటంటే.. ఆ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దామా..!
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీపాన ఉన్న సేనాని విహార్ ప్రాంతానికి చెందిన పర్మానంద్ సింగ్ అనే వ్యక్తి తన పెళ్లి కోసం తన ప్రొఫైల్‌ను ఓ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. సోనీ అనే మహిళ ఆ బయోడేటాను చూసి.. పర్మానంద్‌కు ఫోన్ చేసింది. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ తర్వాత అది కాస్తా పెళ్లికి దారి తీసింది. వీరిద్దరి వివాహం 2022 నవంబర్‌లో జరిగింది. ఫస్ట్ నైట్ జరగలేదు. కానీ సరిగ్గా నెల గడిచిన తర్వాత ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
సోనీ తన భార్య అని.. తనకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకుందని.. ఆమెతో వివాహ బంధాన్ని కొనసాగిస్తే.. తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. అంతేకాదు ఏకంగా రూ. 2.7 లక్షలు డిమాండ్ చేశాడు నిందితుడు. భయపడిన పర్మానంద్.. నిందితుడు అడిగిన అమౌంట్‌ను ఇచ్చేశాడు. అనంతరం సోనీ ఇంట్లోని బంగారు నగలతో ఉడాయించింది. డబ్బుల కోసం ఆ ఇద్దరూ తనను మోసం చేశారని గ్రహించిన పర్మానంద్.. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అతడిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
