Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిలవని పెళ్ళికి వెళ్లి వరుడితో సెల్ఫీ దిగుతూ నేను ఫ్రీగా తినడానికి వచ్చానని చెప్పిన స్టూడెంట్.. వరుడి రియాక్షన్ కు నెటిజన్లు ఫిదా

ఇప్పుడు దాదాపు ఇటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే .. పెళ్లికి పిలవ‌కుండా విందు కోసం వెళ్లిన స్టూడెంట్ తన గురించి పెళ్ళికొడుకు చెప్పాడు. మరి ఏమి జరిగిందంటే..

Viral Video: పిలవని పెళ్ళికి వెళ్లి వరుడితో సెల్ఫీ దిగుతూ నేను ఫ్రీగా తినడానికి వచ్చానని చెప్పిన స్టూడెంట్.. వరుడి రియాక్షన్ కు నెటిజన్లు ఫిదా
Wedding Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Dec 02, 2022 | 7:43 PM

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఒక MBA విద్యార్థి పిలవని పెళ్ళికి వెళ్లి భోజనం తిన్న సంఘటన గురించి.. ఆ స్టూడెంట్ గురించి తెలుసుకున్న వధూవరుల బంధువులు ఆ యువకుడితో గిన్నెలు కడిగేలా చేశారు. అంతేకాదు ఆ వీడియోను కూడా వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై తీవ్ర స్పందన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు దాదాపు ఇటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే .. పెళ్లికి పిలవ‌కుండా విందు కోసం వెళ్లిన స్టూడెంట్ తన గురించి పెళ్ళికొడుకు చెప్పాడు. మరి ఏమి జరిగిందంటే..

ఓ వివాహ వేడుకకు వెళ్లిన విద్యార్థి.. నేరుగా వరుడి వద్దకు వెళ్ళాడు. అక్కడ వరుడితో కొన్ని సెల్ఫీలు దిగాడు. అనంతరం ఆ పెళ్లికొడుకుతో నాకు మీ పేరు కూడా తెలియదు.. ఫ్రీ ఫుడ్ తినడానికి పెళ్ళికి వచ్చానని చెప్పాడు. వైరల్ అవుతున్న క్లిప్‌లో..  విద్యార్థి.. పెళ్లికొడుకుతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. నేను హాస్టల్‌లో నివసిస్తున్నాను. ఆహారం వండలేదు. నాకు ఆకలిగా ఉంది.. కనుక నేను మీ పెళ్ళికి తినడానికి వచ్చాను. మీకేమైనా సమస్య ఉందా?’ అని అడిగాడు. ఆ స్టూడెంట్ నిజాయితీని చూసి పెళ్లికొడుకు ‘నాకేమీ ఇబ్బంది లేదు’ అని చెప్పాడు. అంతేకాదు పెళ్ళికొడుకు ఇంకా మాట్లాడుతూ.. మీకు కావాలంటే మీ హాస్టల్‌కి కూడా కొంచెం ఫుడ్ ప్యాక్ చేయించి తీసుకుని వెళ్ళండని సూచించాడు. ఈ చిన్న క్లిప్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ఈ క్యూట్ వీడియోను ఐఏఎస్ అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు’ అనే క్యాప్షన్‌ కూడా ఈ వీడియోకి జత చేశారు. ఈ 45 సెకన్ల క్లిప్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.  వీడియోను 1.3లక్షలకు పైగా వీక్షించగా, 10 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. సోదరుడు హృదయాన్ని గెలుచుకున్నాడు.  మీరు ఉచితంగా భోజనం చేసినా, మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరని ఒకరు.. నేను కూడా హాస్టల్ లో ఉన్న సమయంలో ఇలా చాలాసార్లు తిన్నాను ఎవరూ బాధపడలేదు అప్పుడు అంటూ ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వరుడు నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..