Viral Video: ఎవరైతే మాకేంటి.. సింహాన్ని రఫ్ఫాడించిన దున్నపోతులు.. వీడియో షాక్ అవ్వాల్సిందే
సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటాయి.
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని వణుకుపుట్టిస్తాయి. క్రూర మృగాల వెట ఎలాఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరాల లేదు. సింహానికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో లో ఓ సింహం దున్నపోతు పైన దాడి చేయడం చూడొచ్చు.. ఎలాంటి జంతువునైనా సింహం ఇట్టే మట్టుపెడుతుంది. కానీ దున్నపోతు లాంటి బలమైన జంతువు కోసం సింహం కాస్త కష్టపడల్సిందే.. దున్నపోతు ను సింహం వేటాడితే దానికి 5 రోజులవరకు ఆహారం కొరత ఉండదట. అందుకే అవి దున్నపోతు లాంటి జంతువులను ఎక్కువగా వేటాడుతూ ఉంటాయి. ఈ వీడియోలో దున్నపోతు పై సింహం చేసిన దాడి నిజంగా భయంకరంగా ఉంది.
ఓ దున్నపోతుల గుంపు మీద ఒక్కసారిగా సింహం దాడి చేయడానికి ప్రయత్నించింది. సింహాన్ని గమనించిన దున్నపోతులు దానిపై ప్రతిదాడి చేశాయి. దున్నపోతులు వాటి కొమ్ములతో సింహాన్ని కుమ్మడానికి ప్రయత్నించాయి. దున్నపోతుల గుంపుగా సింహంపై దాడి చేశాయి. అన్ని దున్నపోతులు ఎదురుతిరగడంతో సింహం భయపడింది. అక్కడి నుంచి వేగంగా పరిగెడుతూ తప్పించుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram