ఈ కోడి చాలా స్పెషల్: మెడ కింది నుంచి గుడ్డు పెడుతోంది..!

ప్రపంచంలో మనం చాలా వింతలు చూస్తూంటాం.. కొన్ని నిజంగానే ఆశ్చర్యానికి లోనుచేస్తాయి. కొన్ని చూస్తుంటే.. ఇవి జరుగుతాయా..? అని అనుకుంటూంటాం. అలాంటి సంఘటనే ఒకటి కర్ణాటక మండ్యలలో చోటుచేసుకుంది. ఓ కోడిపెట్ట సడన్‌గా అందరినీ ఆశ్చర్యపరిచింది. మామూలుగా కోడి వెనుకభాగం నుంచి గుడ్డులు పెడతాయి. కానీ ఈ విచిత్ర కోడి మెడ కింది భాగం నుంచి కోడి గుడ్డు పెడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. శివరామె గౌడ అనే వ్యక్తి రెండేళ్లుగా కోడిపెట్టను పెంచుకుంటున్నాడు. ఓ రోజు కోడి […]

ఈ కోడి చాలా స్పెషల్: మెడ కింది నుంచి గుడ్డు పెడుతోంది..!
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 7:55 PM

ప్రపంచంలో మనం చాలా వింతలు చూస్తూంటాం.. కొన్ని నిజంగానే ఆశ్చర్యానికి లోనుచేస్తాయి. కొన్ని చూస్తుంటే.. ఇవి జరుగుతాయా..? అని అనుకుంటూంటాం. అలాంటి సంఘటనే ఒకటి కర్ణాటక మండ్యలలో చోటుచేసుకుంది. ఓ కోడిపెట్ట సడన్‌గా అందరినీ ఆశ్చర్యపరిచింది. మామూలుగా కోడి వెనుకభాగం నుంచి గుడ్డులు పెడతాయి. కానీ ఈ విచిత్ర కోడి మెడ కింది భాగం నుంచి కోడి గుడ్డు పెడుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. శివరామె గౌడ అనే వ్యక్తి రెండేళ్లుగా కోడిపెట్టను పెంచుకుంటున్నాడు. ఓ రోజు కోడి మెడకింది భాగం నుంచి గుడ్డును పెడుతుండటం గమనించి అవాక్కడయ్యాడు. వెంటనే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ కోడిని చూసిన నెటిజన్స్ నిజామా..? అని ఆశ్చర్యపోతున్నారు. షేర్లు మీద షేర్లు చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. ఇది చూసిన స్థానికులు ఇదెలా సాధ్యమని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.