ఆకాశం నుంచి పడ్డ అంతుచిక్కని పదార్థం..ఉల్కనా? మరేదైనానా?
బిహార్‌లోని మధుబని జిల్లాలో ఒక వింత చోటుచేసుకుంది. ఆకాశంలోంచి పడిన ఒక అంతుచిక్కని పదార్థం రైతులకు భయంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది. వివరాల్లోకి వెళ్తే… రైతులు పొలంలో పని చేసుకుంటుండగా అకస్మాత్తుగా పెద్దశబ్దం వచ్చింది. దీంతో రైతులు ఏంటని చూస్తే బండరాయి మాదిరిగా ఉన్న ఒక పదార్థం పెద్దగా శబ్దం చేస్తూ ఆకాశంలోంచి దూసుకువచ్చి పొలంలో పడింది. వచ్చిన వేగానికి అది భూమిలో పడిన స్థలంలో నాలుగు అడుగుల లోతుకు దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న అధికారులు గ్రామస్థుల […]

బిహార్‌లోని మధుబని జిల్లాలో ఒక వింత చోటుచేసుకుంది. ఆకాశంలోంచి పడిన ఒక అంతుచిక్కని పదార్థం రైతులకు భయంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది. వివరాల్లోకి వెళ్తే… రైతులు పొలంలో పని చేసుకుంటుండగా అకస్మాత్తుగా పెద్దశబ్దం వచ్చింది. దీంతో రైతులు ఏంటని చూస్తే బండరాయి మాదిరిగా ఉన్న ఒక పదార్థం పెద్దగా శబ్దం చేస్తూ ఆకాశంలోంచి దూసుకువచ్చి పొలంలో పడింది. వచ్చిన వేగానికి అది భూమిలో పడిన స్థలంలో నాలుగు అడుగుల లోతుకు దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న అధికారులు గ్రామస్థుల సాయంతో బయటికి తీశారు. అనంతరం దాన్ని పరిశీలించిన గ్రామస్థులు ఆ రాయికి ఆకర్షణశక్తి చాలా ఎక్కువగా ఉందని, దాని బరువు 33 పౌండ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ పదార్థాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఉల్క లక్షణాలు ఉన్నాయని అంటున్నారు. సాధారణంగా ఉల్కలు అనేవి దుమ్ము, రాయి లాంటి కణాలను కలుపుకుని ఒక గట్టి పదార్థంగా ఏర్పడుతాయని అన్నారు. ఈ ఉల్కని అధికారులు పట్నాలోని మ్యూజియానికి తరలించగా అక్కడ బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ దాన్ని పరిశీలించారు.
पटना स्थित 1 अणे मार्ग के ‘संकल्प’ में मधुबनी के लौकही अंचल के ग्राम महादेवा में मिले संभावित उल्का पिण्ड का अवलोकन करते हुए।https://t.co/1L4eoagkfJ pic.twitter.com/DA9eL5rp28
— Nitish Kumar (@NitishKumar) July 24, 2019