వీడెవడండి బాబు.. ఫుల్లుగా తాగేశాడు.. చివరికి దొంగకే అది ఇచ్చేశాడు.. తెల్లవారాక చూస్తే
మద్యం సేవించిన తర్వాత చాలామంది విచిత్రంగా, వింతగా ప్రవర్తిస్తుంటారు. చుట్టు పక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. ప్రపంచాన్నే మరిచిపోయి మైకంలో ఉండిపోతారు. మరి కొందరైతే అరవడం, గొలచేయడం ఆఖరికి గొడవలు కూడా పెట్టుకుంటారు.
మద్యం సేవించిన తర్వాత చాలామంది విచిత్రంగా, వింతగా ప్రవర్తిస్తుంటారు. చుట్టు పక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. ప్రపంచాన్నే మరిచిపోయి మైకంలో ఉండిపోతారు. మరి కొందరైతే అరవడం, గొలచేయడం ఆఖరికి గొడవలు కూడా పెట్టుకుంటారు. చివరికి మత్తు మొత్తం దిగిపోయాక అప్పటివరకు చేసిందంతా మర్చిపోతారు. ఇలాంటి విచిత్ర ఘటనలు ప్రతిచోట జరిగేవే. అయితే ఓ వ్యక్తి మాత్రం తాగిన మైకంలో ఓ దొంగకు తన కారునే అప్పగించడం అందర్ని నవ్విస్తోంది. వివరాల్లోకి వెళ్తే హర్యాణాలోని గురుగ్రామ్‌లో అమిత్ ప్రకాష్(30) అనే వ్యక్తి అప్పటికే తాగి ఉన్నాడు. మళ్లీ ఆల్కహాల్ కొనుక్కోని.. కారులో సేవిద్దామనుకున్నాడు. దీంతో గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని ఓ వైన్ షాపుకెళ్లి అక్కడ ఓ మందు బాటిల్‌ను తీసుకున్నాడు. ఆ తర్వాత తన కారు దగ్గరికెళ్లి తాగడం మొదలుపెట్టాడు. ఇంతలోనే ఓ అపరిచిత వ్యక్తి అక్కడికి వచ్చాడు. నేను కూడా తాగొచ్చా అని అతడు అడగడంతో ప్రకాష్ అతనికి కూడా మద్యం ఇచ్చాడు.
ఆ తర్వాత వాళ్లిద్దరూ కారులో సుభాష్ చౌక్ వరకు వెళ్లారు. ఆ తర్వాత ఆ అపరిచిత వ్యక్తి ప్రకాష్ ను కారు దిగమన్నాడు. అయితే ప్రకాష్ మాత్రం ఆ కారు తనదే అన్న విషయాన్ని కూడా మర్చిపోయి కారు దిగేశాడు. చివరికి ఆ దొంగ కారులో వెళ్లిపోయాడు. ఆ తర్వాత ప్రకాష్ ఆటోలో ఇంటికి వచ్చేసి నిద్రపోయాడు. తెల్లవారు జామున అతనికి రాత్రి జరిగింది గుర్తుకొచ్చింది. తాగిన మైకంలో ఓ వ్యక్తికి కారునే అప్పగించినట్లు తెలుసుకున్నాడు. చివరికి పోలీసులను ఆశ్రయించాడు. మొదట ప్రకాష్ మద్యం కొనుక్కోవడానికి వైన్ షాపుకి వెళ్లినప్పుడు అప్పటికే తాగిన మైకంలో ఉండటంతో రూ.2 వేల వైన్ బాటిల్‌కు రూ.20 వేలు ఇచ్చానని.. అయినప్పటికీ ఆ షాప్ ఓనర్ తనకు రూ.18 వేలు తిరిగి ఇచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత ఓ వ్యక్తితో తాగి అతనికే కారు అప్పజెప్పానని.. అందులో తన రూ.18 వేల నగదు, లాప్‌టాప్, మొబైల్ ఫోన్ కూడా ఉన్నట్లు చెప్పాడు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి