AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం.. 22వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి 5 ఏళ్ల బాలుడు మృతి..

ఆటో-లాక్ సిస్టమ్ ఉన్న మెయిన్‌ డోర్ అతని వెనుక మూసుకుపోయింది. ఇంటి పనిమనిషి బయట లాక్ చేయబడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉండిపోయిన పిల్లవాడు భయంతో వణికిపోయాడు. ఆ పిల్లవాడు బాల్కనీకి వెళ్లి సహాయం కోసం పిలుస్తూ బట్టలు ఆరేసుకును రాడ్‌ పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు..ఈ క్రమంలోనే కిందపడి మరణించాడు.

అయ్యో పాపం.. 22వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి 5 ఏళ్ల బాలుడు మృతి..
Boy Falls From 22nd Floor
Jyothi Gadda
|

Updated on: Nov 18, 2025 | 9:37 PM

Share

హర్యానాలోని గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు 22వ అంతస్తులోని ఫ్లాట్ నుంచి కింద పడి మరణించిన ఘటన అందరినీ కలచివేసింది. ఫ్లాట్ తలుపులు మూసుకుపోవడంతో భయపడిపోయిన బాలుడు బాల్కనీ ఎక్కి సాయం అర్థించే క్రమంలో పట్టుతప్పి కిందపడి మరణించాడు. ఈ విషాద సంఘటన శనివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో సెక్టార్ 62లోని పయనీర్ ప్రెసిడియా హౌసింగ్ సొసైటీలో జరిగింది.

రుద్ర తేజ్ సింగ్ అనే ఆ చిన్నారి ఆడుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అతనితో పాటు ఒక పనిమనిషి కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. బాలుడి తల్లిదండ్రులు తండ్రి ప్రకాశ్‌ చంద్ర బిల్డర్, తల్లి ఒక డాక్టర్‌ కావటంతో ఇద్దరూ తమ పనుల్లో బయటకు వెళ్లిపోయారు. బాలుడిని చూసుకునేందుకు పని మనిషిని నియమించారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు రుద్రతేజ్‌ ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్ర లిఫ్ట్ నుంచి బయటకు రాగానే ఫ్లాట్‌లోకి పరిగెత్తాడు. ఆటో-లాక్ సిస్టమ్ ఉన్న మెయిన్‌ డోర్ అతని వెనుక మూసుకుపోయింది. ఇంటి పనిమనిషి బయట లాక్ చేయబడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉండిపోయిన పిల్లవాడు భయంతో వణికిపోయాడు. ఆ పిల్లవాడు బాల్కనీకి వెళ్లి సహాయం కోసం పిలుస్తూ బట్టలు ఆరేసుకును రాడ్‌ పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు..ఈ క్రమంలోనే కిందపడి మరణించాడు.

ఇవి కూడా చదవండి

తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం అయిన రుద్రతేజ్‌ దుర్మరణం ఆ తల్లిదండ్రులను బతికి ఉన్న శవాలుగా మార్చేసింది. బాలుడు బ్యాలెన్స్ తప్పి 22వ అంతస్తు నుంచి కిందపడిపోవడంతో స్థానికులు బాలుడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మరణించినట్టుగా వైద్యులు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం తర్వాత చిన్నారి మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత
700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత
రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!
రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? ఫొటోస్ ఇదిగో
లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? ఫొటోస్ ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన
ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన