AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సెక్యూరిటీ సాహసానికి సలాం కొట్టాల్సిందే.. రాబరీకి వచ్చిన దుండగులతో తలపడి..

సెక్యూరిటీ జాబ్ అంటేనే ఎన్నో ఆటుపోట్లతో కూడుకున్నది. రక్షణగా నిలుస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల బారిన పడకుండా కాపాడతారు. పంజాబ్ లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ....

Viral Video: సెక్యూరిటీ సాహసానికి సలాం కొట్టాల్సిందే.. రాబరీకి వచ్చిన దుండగులతో తలపడి..
Brave Security Guard
Ganesh Mudavath
|

Updated on: Jul 13, 2022 | 5:22 PM

Share

సెక్యూరిటీ జాబ్ అంటేనే ఎన్నో ఆటుపోట్లతో కూడుకున్నది. రక్షణగా నిలుస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల బారిన పడకుండా కాపాడతారు. పంజాబ్ లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ సెక్యూరిటీ గార్డుపై గుర్తు తెలియని దుండగులు దాడులకు పాల్పడ్డారు. అయినప్పటికీ అతను నెరవకుండా వారితో పోట్లాటకు దిగాడు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు చేతికి గాయమైంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఓ సెక్యూరిటీ గార్డు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. దుండగుల దోపిడీ యత్నాన్ని నిలువరించి విఫలమయ్యాడు. చివరి క్షణంలో దుండగులు తీవ్రంగా దాడి చేయడంతో సెక్యూరిటీ గార్డు కింద పడిపోయాడు. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ముగ్గురు వ్యక్తులు ముఖాలు కప్పుకుని బైక్ పై సెక్యూరిటీ గార్డు వద్ద వచ్చారు.

వారిని చూడగానే సెక్యూరిటీకి అనుమానం కలిగింది. ముసుగులు తీయాలని, ముఖాలు చూపించాలని కోరడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విచక్షణ కోల్పోయి సెక్యూరిటీ గార్డుతో ఘర్షణకు దిగారు. అంతే కాకుండా కొట్టారు కూడా. ఫలితంగా తానూ ఆ దుండగులను కొట్టినట్లు సెక్యూరిటీ మందర్ సింగ్ చెప్పాడు. దుండగులు మందర్ సింగ్‌ను కొట్టి, పదునైన ఆయుధంతో దాడి చేశారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి