AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అరెరె.. మంచి రీల్ చేద్దామనుకుంటే.. మాడు పగిలిందిగా..

డాబాపై నిలిచిన నీళ్లలో మంచి రీల్ చేద్దామనుకుంది. అనుకున్నదే తడువుగా మంచి పాట పెట్టుకుని డ్యాన్స్ షురూ చేసింది. ఇలా డ్యాన్స్ షురూ చేసిందో లేదో.. క్షణాల వ్యవధిలోనే....

Viral Video: అరెరె.. మంచి రీల్ చేద్దామనుకుంటే.. మాడు పగిలిందిగా..
Girl Slips Mid Reel
Ram Naramaneni
|

Updated on: Sep 13, 2024 | 3:56 PM

Share

అందరూ చేసేదే నేనూ చేస్తే కిక్కేముంది!. ఎవ్వరూ చేయనిది, ఎవ్వరూ చేయలేనిదీ చేయాలె!. అందర్లోనూ ఫేమస్సవ్వాలె.. ఇదీ వరస. యూత్‌ను ఇలా పట్టి పీడిస్తున్న రీల్స్ పిచ్చి.. నానాటికీ ముదిరిపోతోంది. క్రియేటివిటీ పేరుతో పైత్యం ప్రదర్శిస్తూ..ఓవర్‌ నైట్‌లో ఫేమ్‌ దక్కించుకోవాలనే ఉబలాటంతో యువత రిస్కీ ఫీట్లతో లైఫ్‌ను డేంజర్ జోన్‌లోకి నెడుతున్నారు.  ఒక్క వీడియో ట్రెండ్ అయితే చాలు ఒక్క రాత్రిలోనే ఫేమస్ అయిపోవచ్చు. ఫాలోవర్స్ పెరిగితే ప్రమోషన్లతో డబ్బు కూడా వచ్చి పడుతుంది. అందుకే యువతరం… యూట్యూబ్ షార్ట్ వీడియోలు, వివిధ రకాల వీడియోలు,  రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యేందుకు ఆరాటపడుతున్నారు. సోషల్ మీడియా కోసం కంటెంట్‌ను క్రియేట్  విషయంలో ఎలాంటి లిమిటేషన్స్ లేకపోవడంతో వీరు రెచ్చిపోతున్నారు. జనాదరణ పొందే ప్రయత్నంలో, వారు తరచూ తమ జీవితాలను ప్రమాదంలో పడేసే పనులు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ అమ్మాయి ఇంటి డాబా మీదకు ఎక్కి.. ఓ హిందీ పాటకు డ్యాన్స్ వేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ డాబాపై అప్పటికే వర్షం నీళ్లు నిలిచి ఉన్నాయ్.. ఆ నీళ్లు ఉంటే ఇంకా ఎఫెక్ట్ బాగుంటుంది అనుకుందేమో.. అలానే రింగులు తిరుగుతూ డ్యాన్స్ వేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఊహించని ఝలక్ తగిలింది.

వీడియో దిగువన చూడండి…

వైరల్ అవుతున్న వీడియోలో, తేలికపాటి వర్షం కురిసిన తర్వాత ఓ అమ్మాయి రీల్ చేసేందుకు డాబా ఎక్కింది. అక్కడ పాటకు డ్యాన్స్ చేస్తూ రీల్ చేయాలనుకుంది. అక్కడ నిలిచిన నీటికి పాచి పట్టడంతో.. కాలు జారడంతో కిందపడి ముఖం పచ్చడైంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో hakeem.khan86 అనే అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఈ వీడియోకు ఓ రేంజ్ వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..