Viral: గోరు సైజంత వాక్యూమ్‌ క్లీనర్‌.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం..

సాధారణంగా మనం ఉపయోగించే వ్యాక్యూమ్‌ క్లీనర్ సైజ్‌ పరిమాణం పెద్దగా ఉంటుంది. అయితే చేతి గోరంత పరిమాణంలో ఉన్న వ్యాక్యూమ్‌ తయారు చేసి అబ్బుర పరిచారు. ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్‌ క్లీనర్‌గా గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. దీని పరిమాణం కేవలం 0.65 సెంటీమీటర్లు అంటే 0.25 అంగుళాలుగా ఉంది...

Viral: గోరు సైజంత వాక్యూమ్‌ క్లీనర్‌.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం..
Guinness Record
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 13, 2024 | 2:35 PM

కాదేది గిన్నిస్‌ బుక్‌కి అనర్హం అంటుంటారు. నలుగురు చేసే పనికి భిన్నంగా చేసే పని ఏదైనా గిన్నిస్‌ బుక్‌లో స్థానం దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు చెందిన ఓ 23 ఏళ్ల వ్యక్తి అరుదైన ఘనత సాధించి గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, న్యూస్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ అతను సాధించిన ఘనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా మనం ఉపయోగించే వ్యాక్యూమ్‌ క్లీనర్ సైజ్‌ పరిమాణం పెద్దగా ఉంటుంది. అయితే చేతి గోరంత పరిమాణంలో ఉన్న వ్యాక్యూమ్‌ తయారు చేసి అబ్బుర పరిచారు. ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్‌ క్లీనర్‌గా గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. దీని పరిమాణం కేవలం 0.65 సెంటీమీటర్లు అంటే 0.25 అంగుళాలుగా ఉంది. 25 ఏళ్ల తపాల నాదముని ఈ అరుదైన ఘనను సాధించాడు. అయితే నాదముని గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం.

గిన్నిస్‌ రికార్డ్స్‌ ప్రకారం.. వాక్యూమ్ క్లీనర్ కొలత దానిలోని అతి చిన్న భాగం నుంచి కొలిచారు. హ్యాండిల్‌, పవర్‌ కార్డును ఇందులో చేర్చలేదు. 2020లో నాదముని 1.76 సెంటీమీటర్ల వాక్యూమ్ క్లీనర్‌ను తయారు చేశారు. అప్పట్లో ఇది గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. అయితే తాజాగా తన రికార్డును తానే తిరగరాశాడు. మొదటి వాక్యూమ్‌ క్లీనర్‌ తర్వాత రెండు ప్రయత్నాల్లో విఫలమైన నాదముని ఈసారి అత్యంత చిన్న వాక్యూమ్‌ క్లీనర్‌ను రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..