Viral: మీకు తెలుసా.? మనుషులే కాదు ఈ జంతువులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయి!

దేవుడి ఇచ్చిన జీవితాన్ని ఆద్యంతరంగా ముగించే హక్కు ఎవరికీ ఉండదు. అయినా కొందరు చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు వదిలేస్తుంటారు. నిత్యం సమాజంలో ఇలాంటి ఆత్మహత్యలకు సంబంధించిన సంఘటనలు చూస్తునే ఉంటాం. అయితే ఈ ఆత్మహత్యలు కేవలం మనుషులకే పరిమితం కాదని మీకు తెలుసా.? జంతువులు కూడా ప్రాణాన్ని బలవంతంగా తీసుకుంటాయని...

Viral: మీకు తెలుసా.? మనుషులే కాదు ఈ జంతువులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయి!
Animals
Follow us

|

Updated on: Sep 13, 2024 | 4:27 PM

దేవుడి ఇచ్చిన జీవితాన్ని ఆద్యంతరంగా ముగించే హక్కు ఎవరికీ ఉండదు. అయినా కొందరు చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు వదిలేస్తుంటారు. నిత్యం సమాజంలో ఇలాంటి ఆత్మహత్యలకు సంబంధించిన సంఘటనలు చూస్తునే ఉంటాం. అయితే ఈ ఆత్మహత్యలు కేవలం మనుషులకే పరిమితం కాదని మీకు తెలుసా.? జంతువులు కూడా ప్రాణాన్ని బలవంతంగా తీసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. జంతువులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి. ? ఏయే జంతువులు ఇలాంటి చర్యలకు పాల్పడుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండే జంతువుల్లో కుక్కలు ప్రధానమైనవి. అయితే కుక్కలు ఆత్మహత్య చేసుకుంటాయని అంటే మీరు నమ్ముతారా.? ఒత్తిడి, నిరాశకు గురైన సమయంలో అవి ఆత్మహత్యకు పాల్పడుతాయని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. తనకు తాను గాయ పరుచుకోవడం, గోడలు దూకుతుండడం వంటివి కుక్కల్లో ఆత్మహత్యలకు ముందస్తు లక్షణంగా భావించాలి.

ఎలుకలు కూడా ఆత్మహత్య చేసకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, అనారోగ్యం, ఒంటరితనం వంటి సమస్యలు ఎదురైన సమయంలో ఎలుకలు చనిపోయతాయని అంటున్నారు. తిమింగలాలు, డాల్ఫిన్లలో కూడా ఆత్మహత్య సంకేతాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా ఒడ్డుకు కొట్టుకురావడం, లేదా ఊపిరిని బిగబట్టడం ద్వారా ఇవి తనువు చాలిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఒత్తిడికి గురైనప్పుడు పందులు ఆత్మహత్యలు చేసుకుంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఒక అధ్యయనం ప్రకారం , పందులు తమను తాము చంపుకోవడానికి గోడలకు ఢీకొడుతాయని అంటున్నారు. పిల్లులు సైతం ఆత్మహత్య చేసుకుంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. నిరాశకు గురైనప్పుడు ప్రాణం తీసుకుంటాయని అంటున్నారు. చేపలు కూడా తమ జీవితాన్ని అద్యాంతరంగా ముగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మంచి నీటిలో లేదా చేపల పెంపకం చేపట్టే చోట ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం మేరకు అందించినవి మాత్రమే.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీకు తెలుసా.? మనుషులే కాదు ఈ జంతువులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయి.!
మీకు తెలుసా.? మనుషులే కాదు ఈ జంతువులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయి.!
మీ ఐ ఫోకస్ ఏపాటిది.? ఈ ఫోటో నెంబర్ గుర్తిస్తే మీరే కింగ్‌లు
మీ ఐ ఫోకస్ ఏపాటిది.? ఈ ఫోటో నెంబర్ గుర్తిస్తే మీరే కింగ్‌లు
ట్రైన్‌లో రైల్వే ఉద్యోగిని కొట్టి చంపిన ప్రయాణికులు.. !
ట్రైన్‌లో రైల్వే ఉద్యోగిని కొట్టి చంపిన ప్రయాణికులు.. !
భార్య చిన్ననాటి ఆల్బమ్ తిరగేసిన భర్త.. అందులో ఒక ఫోటో చూడగా
భార్య చిన్ననాటి ఆల్బమ్ తిరగేసిన భర్త.. అందులో ఒక ఫోటో చూడగా
హెల్తీ హెయిర్ కోసం బొప్పాయి హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి..
హెల్తీ హెయిర్ కోసం బొప్పాయి హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి..
100 కోట్ల మంది ఫాలోవర్స్‌తో ఫుట్‌బాల్ దిగ్గజం సరికొత్త చరిత్ర
100 కోట్ల మంది ఫాలోవర్స్‌తో ఫుట్‌బాల్ దిగ్గజం సరికొత్త చరిత్ర
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం నయా పాలసీ
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం నయా పాలసీ
అక్కో.. తల ఎట్టుంది..? ఎన్ని కుట్లు పడ్డాయ్...
అక్కో.. తల ఎట్టుంది..? ఎన్ని కుట్లు పడ్డాయ్...
అత్యధిక వడ్డీ వచ్చేది ఇక్కడే.. ఎఫ్‌డీ చేయాలంటే ఇవే బెస్ట్..
అత్యధిక వడ్డీ వచ్చేది ఇక్కడే.. ఎఫ్‌డీ చేయాలంటే ఇవే బెస్ట్..
నాన్నకు ప్రేమతో.. గుండెల్ని పిండేసిన ఎమోషన్స్..
నాన్నకు ప్రేమతో.. గుండెల్ని పిండేసిన ఎమోషన్స్..