Video Viral: ఈ భారీ అనకొండను మీరెప్పుడైనా చూశారా..?.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Video Viral: సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. సాధారణంగా పాములు, కొండచిలువలు, పులులు, సింహాలు, మొసళ్లు ఇతర జంతువులకు సంబంధించిన..
Video Viral: సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. సాధారణంగా పాములు, కొండచిలువలు, పులులు, సింహాలు, మొసళ్లు ఇతర జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే జీవుల్లో పాములు ఉంటాయి. ఐర్లాండ్, ఐస్లాండ్, న్యూజిలాండ్, ఉత్తర, దక్షిణ ధృవం మాత్రమే పాములు ఎక్కువగా కనిపించవు. ప్రపంచంలో అనేక రకాల పాములు ఉన్నప్పటికీ, వాటిలో కొన్ని మాత్రమే చాలా ప్రమాదకరమైనవి, విషపూరితమైనవి. కింగ్ కోబ్రా, క్రైట్, రస్సెల్ వైపర్ మొదలైనవి ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి. అదే సమయంలో పైథాన్, అనకొండ (Anaconda) ప్రమాదకరమైన పాములు. ఇవి భూమిపై అతిపెద్ద, బరువైన పాములు. వాటి పొడవు 30 అడుగుల వరకు ఉంటుంది. ఓ పెద్ద అనకొండ నీటిలో తేలుతూ కనిపించిన వీడియో వైరల్ అవుతోంది.
వీడియోలో మీరు అడవి మధ్యలో కొంతమంది పడవలు నడుపుతున్నట్లు మీరు చూడవచ్చు. వారు పడవలో వెళ్తుండగా అతిపెద్ద అనకొండ కనిపించింది. దానిని చూస్తున్నవారు ఒక్కసారిగా ఆరుపులు చేశారు. ఆ అనకొండను చూస్తుంటే అది ఇప్పుడే జంతువును మింగినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే దాని కడుపు మధ్యలో ఉబ్బినట్లే ఉంది. అతిపెద్ద అనకొండను నీటితో ఈదడం పడవలో వెళ్తున్నవారు చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే మీరు సినిమాల్లో చాలా పెద్ద అనకొండను చూసి ఉంటారు. కానీ నిజ జీవితంలో ఇంత పెద్ద అనకొండను చూడటం చాలా అరుదు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌టోల్డ్_నేచర్ పేరుతో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 1.8 మిలియన్లకు పైగా అంటే 18 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. అయితే 60 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు కూడా చేశారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి: