Viral Video: స్టంట్ చేయబోయి బొక్కబోర్లా పడిన ముద్దుగుమ్మ.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Girl Stunt Video: సినిమాల్లో కనిపించే రకరకాల స్టంట్స్‌ చూసి చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. అలాంటి స్టంట్స్.. నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి.

Viral Video: స్టంట్ చేయబోయి బొక్కబోర్లా పడిన ముద్దుగుమ్మ.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 12, 2022 | 2:32 PM

Girl Stunt Video: సినిమాల్లో కనిపించే రకరకాల స్టంట్స్‌ చూసి చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. అలాంటి స్టంట్స్.. నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. ఎందుకంటే ఏమాత్రం తప్పిదం జరిగిన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. వాస్తవానికి స్టంట్స్ అనేవి ఎంతో కష్టంతో కూడుకున్నవి. అందుకే చాలా జాగ్రత్తగా.. ట్రైనర్ల పర్యవేక్షణలో మాత్రమే చేయాలంటారు నిపుణులు. సినిమాల్లో కూడా నటీనటులు నిపుణుల పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా చేస్తారు. దానికోసం ముందస్తుగా ప్రాక్టీస్ సైతం చేస్తారు. ఇంకా కఠినమైన స్టంట్ అయితే.. డూప్‌లతో చేయిస్తారు. అయితే.. తాజాగా చాలామంది స్టంట్స్ చేయాలన్న ధోరణిలో ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇందులో అబ్బాయిలతోపాటు అమ్మాయిలు కూడా ఉంటున్నారు. వీరి విన్యాసాలకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా.. అలాంటి వీడియో ఒకటి నెట్టింట (Social Media) వైరల్ అయ్యింది. ఇందుల్లో ఓ యువతి స్టంట్ చేయబోయి ఇబ్బందుల్లో పడింది. ఇది చూసి అందరూ తెగ నవ్వుతున్నారు.

వైరల్ వీడియోలో.. ఫుల్‌ స్వింగ్‌లో పరుగెత్తుకుంటూ వచ్చిన యువతి.. స్టంట్‌ చేయడానికి ఎలా ప్రయత్నిస్తుందో మీరు చూడవచ్చు. కానీ ఆమె కుర్చీపై కాలు పెట్టగానే, ఆమె కాలు జారి, కుర్చీ మధ్యలో చిక్కుకుపోతుంది. దీంతో ఆమె స్వల్పంగా గాయపడుతుంది. ఈ స్టంట్ చాలా ప్రమాదకరమైనది.. ఎందుకంటే ఆమె ముందుకు వంగినప్పుడు ఆమె కాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. దీంతోపాటు నడుము కూడా దెబ్బతినవచ్చు. కానీ ఆమె తృటిలో ప్రమాదం నుంచి బయటపడుతుంది.

వైరల్ వీడియో.. 

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో parkour_extreme_youtube పేజీలో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 1 లక్ష 31 వేలకు పైగా వీక్షించగా.. 4 వేల మందికి పైగా లైక్ చేసారు. అదే సమయంలో.. వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలంటూ సూచిస్తున్నారు.

Also Read:

Ginger: మీకు అల్లం తినే అలవాటుందా?అల్సర్, రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం, నోటి దుర్వాసనతోపాటు ఇంకా..

Viral Video: ల్యాప్ టాప్‌లో నిమగ్నమైన వ్యక్తి.. వెనుక విషపూరితమైన పులి పాము.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో వైరల్

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..