Viral Video: కరెన్సీ నోట్లతో మనీ గణేష్ .. అదిరిపోయిన అలంకరణ .. ఎక్కడంటే..
తాజాగా కరెన్సీ నోట్లతో చేసిన గణనాథుడి విగ్రహం మాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అంతేకాదు.. మండపం అలంకరణ కూడా అదిరిపోయింది. ప్రస్తుతం ఆ వినాయకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. ఊరు, వాడ వాడలో గణేష్ మండపాలు ఎంతో అందంగా అలంకరించారు. మండపాల్లో వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. కాలనీ కాలనీకి వేరు విగ్రాహాలు.. కాస్త వెరైటీగా భక్తులను ఆకట్టుకునేందుకు మండపాలను డెకరేట్ చేశారు. మరికొన్ని కోన్ని చోట్ల గణేష్ విగ్రహాలు సరికొత్తగా కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు, పుష్పరాజ్ గెటప్స్‌లలో ఉన్న విగ్రహాలు .. మరికొన్నిచోట్ల బంగారు విగ్రహాలు.. పూలు, పండ్లతో తయారు చేసిన విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా కరెన్సీ నోట్లతో చేసిన గణనాథుడి విగ్రహం మాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అంతేకాదు.. మండపం అలంకరణ కూడా అదిరిపోయింది. ప్రస్తుతం ఆ వినాయకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తమిళనాడులో కరెన్సీ నోట్లతో అలంకరించిన మనీ గణేష్ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కాంచీపురంలోని ఎలెలసింహ వినాయక్‌గర్ ఆలయంలో వినాయక చతుర్థి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి గర్భగుడిని రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, వంద, 200, 500, 2000 రూపాయల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. దాదాపు 15 లక్షలు స్వామి వారి అలంకారానికి ఉపయోగించారు. ఈ మనీ గణేశున్ని చూడడానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.