Viral Video: రెండు పులుల మధ్య భీకరపోరు చూస్తే WWE ఫైట్ కూడా పనికిరాదు..
Viral Video: సింహం అడవికి రాజు అయినప్పటికీ పులి కూడా ఆధిపత్యం చెలాయిస్తుంది. దీని గర్జన వింటే జంతువులన్నీ జడుసుకుంటాయి.
Viral Video: సింహం అడవికి రాజు అయినప్పటికీ పులి కూడా ఆధిపత్యం చెలాయిస్తుంది. దీని గర్జన వింటే జంతువులన్నీ జడుసుకుంటాయి. పులి మాటు వేసిందంటే వేట తప్పనిసరి. దాని పంజా నుంచి తప్పించుకోవడం ఎవ్వరికి సాధ్యం కాదు. అలాంటిది రెండు పులులు ఒకదానికొకటి పోటీ పడితే ఎలా ఉంటాయి.. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మీరు ఈ వీడియో చూస్తే WWE ఫైట్ గుర్తుకువస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పులి గుణం ఏంటంటే అది తన ప్రాంతానికి మరొక పులి వస్తే సహించలేదు. ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే తన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాదు ఈ పోరాటంలో ఒకానొక సందర్భంలో ప్రాణాలు కూడా విడిచిపెడుతాయి. అంతటి పట్టింపు, తెగువ ఉంటాయి. తాజాగా రెండు పులుల పోరాటం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు పులులు ఒకదానితో ఒకటి పోరాడుతుండటం మనం వీడియోలో గమనించవచ్చు.
రెండు ఒకదానిపై కొకటి పంజా విసురుకుంటాయి. రెండు పులుల గర్జనలతో అడవి దద్దరిల్లిపోతుంది. ఈ 12 సెకన్ల వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒకదానిపై ఒకటి కోపంతో ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తాయి. ఈ ఫైట్ చూస్తే మనకు WWE ఫైట్ గుర్తుకువస్తుంది. మధ్య బీకర పోరు వల్ల రెండు పులలు గాయపడుతాయి. కానీ చివరకు విజయం ఎవరిని వరించిందో తెలియకుండా పోతుంది.
ఈ వీడియో Instagramలో indianwildlifeofficial అనే పేజీ నుంచి షేర్ చేశారు. ఈ వీడియోను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటివరకు 29 వేలకు పైగా ప్రజలు ఈ వీడియోను తిలకించారు. లైక్స్, షేర్స్, కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ జంతువుల వీడియోలకు ఇంటర్‌నెట్‌లో తెగ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి.
View this post on Instagram