Viral Video: అనారోగ్యంతో మంచంపట్టిన వృద్ధుడు.. ఆస్పత్రిలోనే డ్యాన్స్‌తో అదరగొట్టిన కుటుంబ సభ్యులు..వైరలవుతున్న వీడియో

ఇంటిల్లిపాది కలిసి భాంగ్రా స్టెప్పులు వేస్తూ ఆస్పత్రిలో హల్ చల్ చేశారు. ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోని ఐపిఎస్ అధికారి హెచ్‌జిఎస్ ధాలివాల్ ఈ వీడియో తన ట్విట్టర్‌ ఖాతలో షేర్‌ చేశారు.

Viral Video: అనారోగ్యంతో మంచంపట్టిన వృద్ధుడు.. ఆస్పత్రిలోనే డ్యాన్స్‌తో అదరగొట్టిన కుటుంబ సభ్యులు..వైరలవుతున్న వీడియో
Bhangra
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 23, 2022 | 1:30 PM

Viral Video: ఆటలు, పాటలు, డ్యాన్స్‌ మనస్సుకు ఉల్లాసాన్ని..ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మంచం పట్టిన మనుషులు కూడా మనసుకు నచ్చిన పాటలు వింటే..ఒకింత ముఖంలో సంతోషం వ్యక్తం చేస్తారనేది పలు సందర్భాల్లో నిరూపితమైంది. అలాంటిదే ఈ ఘటన కూడా..మంచం పట్టిన ఒక వృద్ధుడు తీవ్ర నిరాశతో మరింత అనార్యోగంగా మారుతున్నాడు..దాంతో అతనిని ఉత్సాహపరిచేందుకు వారి కుటుంబ సభ్యులు వినూత్న ప్రయత్నం చేశారు..ఇంటిల్లిపాది కలిసి భాంగ్రా స్టెప్పులు వేస్తూ అతన్ని ఉత్సహపరిచారు. దాంతో అతడు తన కుటుంబ సభ్యులతో భావోద్వేగ క్షణాన్ని పంచుకున్నాడు. ఐపిఎస్ అధికారి హెచ్‌జిఎస్ ధాలివాల్ ఈ వీడియో తన ట్విట్టర్‌ ఖాతలో షేర్‌ చేశారు.

వీడియోలో…పంజాబీ గాయకుడు షర్రీ మాన్ ఓ బిటైన పాటకు కుటుంబంతో కలిసి డ్యాన్స్‌ చేశారు..కెమెరా ఎడమవైపుకు తిరుగుతుండగా, ఆసుపత్రి బెడ్‌పై ఒక వృద్ధుడు బలహీనంగా, అనారోగ్యంతో డ్యాన్స్‌ చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ట్విట్టర్‌లో 35,000 కంటే ఎక్కువ వ్యూస్‌ సాధించింది. వీడియో చూసిన ఒక వినియోగదారు ఇలా అన్నారు. ఇది నిజంగా ఆరాధించదగినదిగా కామెంట్‌ చేశారు. ఇలాంటి ఉత్సాహపరిచే ఘటనలు వారికి మానసిక శక్తిని అందిస్తాయని చెప్పారు.

సంగీతం చికిత్సగా ఎలా పని చేస్తుందో, వైద్య ప్రక్రియలో ఎలా సహాయపడుతుందో మరొకరు హైలైట్ చేశారు. పంజాబీలకు ఖచ్చితంగా అంతులేని స్ఫూర్తి ఉంటుందని ఐపీఎస్ అధికారితో చాలా మంది ఏకీభవించారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని అమ్మమ్మ ఎలా ఆలింగనం చేసిందో చూసి చాలా మంది సంతోషించారు.

అంతకుముందు, అమెరికాలోని అలబామాకు చెందిన వధువు అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రితో కలిసి డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో వైరల్‌గా మారింది. మేరీ బోర్న్ రాబర్ట్స్ అనే మహిళ, ఆమె చిన్నతనంలో తన తండ్రి జిమ్ రాబర్ట్స్‌తో కలిసి డ్యాన్స్‌ చేసేది. ఆమె పెళ్లిలో కూడా అలాంటి డ్యాన్స్‌ చేయాలని వారు ఆశించారు. ఆ రోజు వచ్చినప్పుడు, మేరీ తన వీల్‌చైర్‌లో ఉన్న తన తండ్రిని డ్యాన్స్ ఫ్లోర్‌కి తీసుకువెళ్లి కలిసి డ్యాన్స్ చేసింది. జిమ్‌కు మే 2017లో వేగంగా అభివృద్ధి చెందుతున్న, నయం చేయలేని క్యాన్సర్ అయిన గ్లియోబ్లాస్టోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. గత డిసెంబర్‌లో జరిగే తన కుమార్తె వివాహానికి అతను వస్తాడో లేదో తెలియదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి