Viral Video: నన్ను కాకుండా కుక్కను ఇష్టపడతావా.. యాజమానిని కుమ్మెసిన తాబేలు.. వీడియో వైరల్..
పిల్లి, కుక్క, కోడి, బాతు.. ఇలా కొన్ని జంతువులను ఇంట్లో పెంచుకుంటారు. ఇదే విదేశాల్లో అయితే పక్షులు, పెద్ద పులులు, సింహాలు, పాములు ఇలా అన్నింటిని ఎంతో ప్రేమగా..
పిల్లి, కుక్క, కోడి, బాతు.. ఇలా కొన్ని జంతువులను ఇంట్లో పెంచుకుంటారు. ఇదే విదేశాల్లో అయితే పక్షులు, పెద్ద పులులు, సింహాలు, పాములు ఇలా అన్నింటిని ఎంతో ప్రేమగా తమతోపాటు పెంచుకుంటారు. అవి కూడా తమ యజమానులతో ఎంతో క్లోజ్‌గా ఉంటాయి. ప్రేమగా ఉంటాయి. మానసికంగా కూడా కలిసి పోతాయి. ఇలా ఉండే వీడియోలను మనం చాలా సార్లు చూసి ఉంటాము. అయితే తాజాగా అచ్చు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్(Viral Video) చేసింది. ఇందులో ఒక వ్యక్తి తన పెంపుడు తాబేలు ముందు కుక్కను దగ్గరకు తీసుకుని ప్రేమ చేయడం కనిపిస్తుంది. ఇది గమనించిన తబేలు ఏం చేసిందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మనుషులు ఇలా ఫీల్ అవుతారో అలానే ఈ వీడియోలో తాబేలు ఇబ్బంది పడటం మనం చూడవచ్చు. ఆ తర్వాత ఆ తాబేలు ఏం చేసింది ఈ కింది వీడియోలో చూడండి.
ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పెంపుడు జంతువులను పెంచుకున్నప్పుడు ఇలాంటి సమస్యే వచ్చి పడుతుంది. యజమానితో స్నేహంగా ఉండేందుకు ఒకదానితో మరొకటి పోటీ పడుతాయి. అంతేకాదు జంతువుపై ప్రేమ ఎక్కువ కురిపిస్తే అవి కోపానికి రావడం మనం చూడవచ్చు. అటువంటి పరిస్థితిలో, పెంపుడు జంతువు యజమాని ఒకదానితో సమయం గడిపినప్పుడు, సాధారణంగా ఇతర జంతువు దానిపై కోపం వ్యక్తం చేయడం కనిపిస్తుంది. ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలో ఇలాంటిదేదో చూసి యూజర్లు చాలా షాక్ అవుతున్నారు.
View this post on Instagram
వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కను లాలించడం కనిపిస్తుంది. ఇది చూసి, అతని పెంపుడు తాబేలు ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తన కోపాన్ని వ్యక్తం చేస్తుంది. తనను పట్టించుకోకుండా కుక్కను లాలించడంతో ఇబ్బంది పడింది. కోపంతో తన యజమాని కాలును ఢీ కొట్టడం ఈ వీడియోలో చూడవచ్చు.
ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేసింది తాబేలు. అదే సమయంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏ వినియోగదారులు తమ స్నేహితులతో పంచుకోవడం కనిపిస్తుంది. వీడియోకు వేల సంఖ్యలో వీక్షణలు రావడంతో పెద్ద సంఖ్యలో యూజర్లు దీన్ని లైక్ చేశారు. అదే సమయంలో తాబేలు ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇవి కూడా చదవండి: Donald Trump: ట్రంప్ రోజూ 10 వేల డాలర్లు జరిమానా కట్టాలటా.. ఎందుకో తెలుసా?
Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!