Viral News: ఇదేక్కడి రూల్‌ రా నాయనా!.. బాల్కనీలో బట్టలు ఆరబెడితే రూ రూ. 20 వేలు ఫైన్‌..

సాధారణంగా ఉతికేసిన బట్టలను బాల్కనీలు లేదా టెర్రస్‌పైన ఆరబెడుతుంటారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండే అపార్ట్‌మెంట్లు, పెద్ద పెద్ద భవనాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి

Viral News: ఇదేక్కడి రూల్‌ రా నాయనా!.. బాల్కనీలో బట్టలు ఆరబెడితే రూ రూ. 20 వేలు ఫైన్‌..
Follow us
Basha Shek

|

Updated on: Apr 28, 2022 | 7:56 AM

సాధారణంగా ఉతికేసిన బట్టలను బాల్కనీలు లేదా టెర్రస్‌పైన ఆరబెడుతుంటారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండే అపార్ట్‌మెంట్లు, పెద్ద పెద్ద భవనాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఒకచోట మాత్రం బాల్కనీలో బట్టలు ఆరబెట్టవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా హద్దు మీరి బాల్కనీలు, కిటికీలకు బట్టలు వేలాడదీస్తే ఏకంగా రూ.20వేలు జరిమానా విధిస్తామని హెచ్చరికలు పంపారు. ఈ నిబంధనలు విధించింది ఎక్కడో కాదు.. నిత్యం ఆంక్షల చట్రంలో నలిగిపోయే యూఏఈలోనే. అపార్ట్‌మెంట్ల బాల్కనీలు, కిటికీలపై బట్టలు ఆరబెట్టడం వల్ల నగర సౌందర్యం దెబ్బతింటుందని అబుదాబి (Abudabi) మున్సిపాలిటీ అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు.

అందుకే ఈ ఆదేశాలు..

ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి 1,000 దిర్హామ్‌లు (ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ. 20 వేలు) లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తామని అధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు.’మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం.. నగరాన్ని అందంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే దుస్తులను బయట ఆరబెట్టకుండా ఆదేశాలు జారీ చేశాం. దీనికి సంబంధించి ఇది వరకే చాలామాందిని హెచ్చరించాం. అయితే పెడచెవిన పెట్టారు. అందుకే కఠిన ఆదేశాలు తీసుకోవాల్సి వచ్చింది. నగరవాసులు లాండ్రీ డ్రైయింగ్, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ఇంట్లోనే బట్టలు ఆరబెట్టుకోవాలి. ఒకవేళ తమ హెచ్చరికలను బేఖాతరు చేసి బాల్కనీలో బట్టలు ఆరవేస్తే మాత్రం జరిమానా చెల్లించాల్సిందే. ఈ విషయంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అధికారులు.

మరిన్నిట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Kaathu Vaakula Rendu Kadhal Twitter Review: కాతువాకుల రెండు కాదల్ సినిమా ట్విట్టర్ రివ్యూ.. సమంత హిట్ కొట్టేనా ?

జాతీయ రికార్డుతో అదరగొట్టిన వెయిట్‌లిఫ్టర్ అన్ మారియా.. పతకాలలో జైన్ యూనివర్శిటీ టాప్..

Prashanth Kishor: ప్రశాంత్‌ కిషోర్‌ ప్రతిపాదనల్లో ఏముంది.. దానికి కాంగ్రెస్‌ ఒప్పుకోలేదా..