Viral Video: మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ మీరే బ్రదర్స్.. బైకర్స్ చేసిన పనికి సలాం చేయాల్సిందే.. వైరల్ వీడియో
సోషల్ మీడియాలో మనం రోజూ కొన్ని వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం. ఈ వీడియోలు చాలా వరకు నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని వీడియోలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతారనడంతో సందేహం లేదు.
సోషల్ మీడియాలో మనం రోజూ కొన్ని వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం. ఈ వీడియోలు చాలా వరకు నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని వీడియోలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతారనడంతో సందేహం లేదు. ఇలాంటి వీడియోలు చూస్తే మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పొచ్చు. అలాంటి ఓ వీడియోను తెలంగాణ సైబరాబాద్ పోలీసులు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో వాహనాలు ఆ అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై నుంచి వెళ్లే అవకాశం ఉంది. ఇంత జరిగినా, కారు డ్రైవర్లు ఎవరూ ఆపి ఈ వ్యక్తికి సహాయం చేయాలని ఆలోచించలేదు. అయితే, రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని గమనించిన ఓ ద్విచక్రవాహనదారుడు బైక్‌ను ఆపాడు. రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు.
బైకర్ చేసిన ప్రయత్నాల తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి స్పృహలోకి వచ్చినట్లు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి మానవత్వానికి ఉదాహరణగా నిలిచాడు. సోషల్ మీడియాలో ఈ వీడియోను చాలా మంది లైక్ చేశారు. వీడియో చూస్తే మానవత్వం ఇంకా బతికే ఉందనిపిస్తోంది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోను తెలంగాణ సైబరాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త రాసే సమయానికి ట్విట్టర్‌లో దాదాపు 90 వేల మంది ఈ వీడియోను చూశారు.
ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఫేస్‌బుక్ పేజీలో కూడా పంచుకున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నవారే నిజమైన వ్యక్తులు అని క్యాప్షన్ అందించారు. తెలంగాణ పోలీసుల ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియోను 29 లక్షల మందికి పైగా చూశారు. వేలాది మంది ఈ వీడియోను లైక్ చేయగా, వందల కొద్దీ కామెంట్లు కూడా వచ్చాయి. రోడ్డుపై సహాయం కోసం ఎవరూ అందుబాటులో లేని సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ వీడియోను చూడటం ద్వారా మానవత్వం ఇంకా అంతరించిపోలేదని మరోసారి చెప్పుకోవచ్చటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Good Samaritan: The greatest good is what we do for one another.#GoodSamaritan pic.twitter.com/7q43VXkty2
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) April 22, 2022
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: చేప కోసం గాలం వేస్తే.. ఏం పడిందో చూస్తే షాక్ అవుతారు !!
Soil Auction: చంద్రుడిపై ఉన్న గుప్పెడు మట్టి విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు !!