Viral Video: కాలేజీలో అమ్మాయిల మధ్య కుస్తీ పోటీ.. నెట్టింట రచ్చ చేస్తోన్న వీడియో!
కాలేజీల్లో ఫ్రెండ్స్ మధ్య, కాలనీల్లో అమ్మలక్కల మధ్య.. అప్పుడప్పుడూ గొడవలు జరుగుతుండటం సర్వసాధారణం. మాట మాట అనుకోవడం..
కాలేజీల్లో ఫ్రెండ్స్ మధ్య, కాలనీల్లో అమ్మలక్కల మధ్య.. అప్పుడప్పుడూ గొడవలు జరుగుతుండటం సర్వసాధారణం. మాట మాట అనుకోవడం.. మితిమీరితే కొట్టుకోవడాలూ మనం చూస్తూనే ఉంటాం. ఇక ఇలాంటి స్ట్రీట్ ఫైట్లు మన దగ్గర మాత్రమే ఉంటాయా.. ఇంకెక్కడా ఉండవా అంటే.? ఇక్కడే కాదండి వరల్డ్‌వైడ్ అంతటా ఇంతే.. హ్యుమన్ నేచరే అంత కదా.. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూశాక కచ్చితంగా మీరూ ఆశ్చర్యపోవడం ఖాయం.
ఇదిగో ఈ ఇద్దరు స్టూడెంట్స్‌ను చూడండి.. ఎలా గొడవ పడుతున్నారో.. అరే.. మాటలు తారాస్థాయికి చేరాయి. ఇదిగో ఈ చెక్స్ కలర్ షర్ట్ అమ్మాయిని చూడండి.. కోపాన్ని ఆపుకోలేకపోయింది. తన మోచేతితో ప్రత్యర్ధి కడుపులో ఎలా గుద్దిందో చూడండి. ఆ దెబ్బకు.. ఎదుటి స్టూడెంట్‌కు కూడా చిర్రెత్తిపోయింది. ఇక ఆగితే ఒట్టు. ఎలా జుట్టు పట్టి మరీ ఇరగదీస్తుందో.. మొదటి దెబ్బకొట్టిన అమ్మాయికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. విపరీతంగా వాయించేసింది. కింద పడేసి మరీ కొట్టింది. ఇది చూసిన వాళ్లు.. వీళ్లు స్టూడెంట్లా.. వీధిరౌడీలా అని చర్చించుకుంటున్నారు. ఏదో మాట అనుకోవడం, తర్వాత కలిసిపోవడం అంటే బాగుంటాయి కానీ.. ఫ్రెండ్స్ మధ్య మరీ ఇంత భగ్గుమనే ద్వేషమా.. నో వే.. అని అంటున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి..