AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఎవడ్రా నువ్వు ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నావ్.. రిజిగ్నేషన్ లెటర్‌లో ఏం రాశాడో తెలుసా..?

మనం రాజీనామాలంటే ఫార్మల్‌ లెటర్‌లో రాసి ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం.. కానీ ఓ డిఫరెంట్ లేఖ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఓ ఉద్యొగి తనకు కొత్త జాబ్ వచ్చింది. అయితే అక్కడే ఉద్యోగి పాత కంపెనీకి ట్విస్ట్ ఇచ్చాడు. తాను కొత్త కంపెనీలో జాయిన్ అవుతున్నాని, కానీ అక్కడ ఇబ్బంది వస్తే మళ్లీ వెనకు వస్తానని రాశాడు. ఆ లెటర్ ఇన్‌స్టాగ్రామ్‌లోని వాల్ స్ట్రీట్ ఒయాసిస్‌ పేజీలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇప్పుడు వరకు మనం ఇలాంటి లెటర్ ఎప్పుడు చూసి ఉండలేదని నిర్మొహమాటంగా చెప్పవచ్చు.

Viral News: ఎవడ్రా నువ్వు ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నావ్.. రిజిగ్నేషన్ లెటర్‌లో ఏం రాశాడో తెలుసా..?
Different Resignation Lette
Velpula Bharath Rao
|

Updated on: Oct 15, 2024 | 7:03 PM

Share

మనం రాజీనామాలంటే ఫార్మల్‌ లెటర్‌లో రాసి ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం.. కానీ ఓ డిఫరెంట్ లేఖ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఓ ఉద్యొగి తనకు కొత్త జాబ్ వచ్చింది. అయితే ఉద్యోగి పాత కంపెనీకి ట్విస్ట్ ఇచ్చాడు. తాను కొత్త కంపెనీలో జాయిన్ అవుతున్నాని, కానీ అక్కడ ఇబ్బంది వస్తే మళ్లీ వెనకు వస్తానని రాశాడు. ఆ లెటర్ ఇన్‌స్టాగ్రామ్‌లోని వాల్ స్ట్రీట్ ఒయాసిస్‌ పేజీలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇప్పుడి వరకు మనం ఇలాంటి లెటర్ ఎప్పుడు చూసి ఉండలేదని నిర్మొహమాటంగా చెప్పవచ్చు.

తేదీ లేని రాజీనామా లేఖ ఘనాలోని న్సుతా వాస్సా అనే పట్టణం నుండి వచ్చింది. ఉద్యోగి ఇలా వ్రాశాడు, “నేను ఒక కంపెనీ నుండి కొత్త ఉద్యోగం సంపాదించాను, నేను కూడా ఆ ప్రదేశానికి వెళ్లి ప్రయత్నించాలనుకుంటున్నాను. అది పని చేయకపోతే, నేను తిరిగి వస్తాను. అలాగే సదరు ఉద్యోగి తన పాత కంపెనీకి శుభాకాంక్షలు కూడా తెలిపాడు.

ఆ ఉద్యోగి నిజాయితీకి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “వారు దానిని చదివినప్పుడు HR ముఖంలో ఎలా ఉంటుందో ఊహించుకోండి!” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “అతను ‘డోర్ తెరిచి ఉంచు’ అని క్లియర్‌‌గా చెబుతున్నాడు” అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఉద్యోగి తాను తిరిగి రావాలని చెప్పడానికి అసలు భయపడలేదని మరోకరు పేర్కొన్నారు. “బోల్డ్ మూవ్! చాలా మంది ప్రజలు తిరిగి వస్తారని చెప్పడానికి చాలా భయపడతారని ఇంకొకరు కామెంట్ చేశారు. మరొకరు అతని విశ్వాసాన్ని మెచ్చుకోవాలి పేర్కొన్నారు. కంపెనీ ఇలా మద్దతుగా ఉంటే, ఎవరు తిరిగి రావడానికి ఇష్టపడరు? అని ఇలా వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు.

వైరల్ అవుతున్న ఫోటో ఇదోగో:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us