AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో పొడవైన ఆ దేశస్థులు క్రమంగా పొట్టివారైపోతున్నారు.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు

ఒకప్పుడు ఆరడుగుల ఆజానుభాహులకు ఆ దేశం పెట్టింది పేరు. పురుషులతో పాటు మహిళలు కూడా ఆరేడు అడుగుల ఎత్తు ఉండేవారు. అందుకే ప్రపంచంలో పొడవైన వ్యక్తులున్న దేశంగా ఆ దేశానికి గుర్తింపు సాధించింది.

ప్రపంచంలో పొడవైన ఆ దేశస్థులు క్రమంగా పొట్టివారైపోతున్నారు.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు
Dutch People
Janardhan Veluru
|

Updated on: Sep 18, 2021 | 11:18 AM

Share

ఒకప్పుడు ఆరడుగుల ఆజానుభాహులకు ఆ దేశం పెట్టింది పేరు. పురుషులతో పాటు మహిళలు కూడా ఆరేడు అడుగుల ఎత్తు ఉండేవారు. అందుకే ప్రపంచంలో పొడవాటి వ్యక్తులున్న దేశంగా నెదర్లాండ్స్‌ గుర్తింపు సాధించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన జనాభా కలిగిన దేశంగా.. గత ఆరు దశాబ్ధాలుగా ఈ రికార్డు నెదర్లాండ్ పేరిటే ఉంది. అయితే ఆ రికార్డుకు ఆ దేశం క్రమంగా దూరమవుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. మునుపటి తరంతో పోల్చితే ఆ దేశస్థులు క్రమంగా పొడుగు తగ్గిపోతున్నారు. 1980లో పుట్టిన వారితో పోలిస్తే 2001లో పుట్టిన వారు పొట్టిగా ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ భూ ప్రపంచంలో ఇప్పటికే ఎక్కువ ఎత్తున జనాభా కలిగిన దేశంగా నెదర్లాండ్స్ నిలవడం కాస్త ఊరట కలిగించే అవకాశం. ప్రస్తుతం ఆ దేశంలో 19ఏళ్ల యువకుడి సగటు ఎత్తు 6 అడుగులు(182.9 సెం.మీ) కాగా, యువతి ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు(169.3 సెం.మీ)గా ఉంది. 1980లో పుట్టిన మునుపటి తరంతో పోల్చితే 2001లో పుట్టినవారు సరాసరిగా కనీసం 1 సెంటీ మీటర్ ఎత్తు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. మహిళలు 1.4 సెం.మీ మేర ఎత్తు తగ్గిపోయారు. ఆ దేశంలోని 19 నుంచి 60 ఏళ్ల వయస్కులైన 7,19,000 మంది ఎత్తుపై ఈ సర్వే నిర్వహించారు.

మరి నెదర్లాండ్స్ ప్రజలు ఎత్తు తగ్గిపోవడానికి గల కారణాలను కూడా ఈ సర్వే చేపట్టిన ఆ దేశ ప్రభుత్వ సంస్థ సీబీఎస్ విశ్లేషించింది. సరైన పౌష్టికాహారం తీసుకోనందునే వారు క్రమంగా ఎత్తు తగ్గిపోతున్నట్లు తేల్చారు. పౌష్టికాహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మునుపటి తరం ఎత్తు మరింత తగ్గిపోవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. 2007లో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం నెదర్లాండ్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అప్పట్లో ఆ దేశంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తద్వారా అప్పట్లో చిన్నారులు సరైన పౌష్టికాహారానికి దూరమై ఉండొచ్చని భావిస్తున్నారు. అది వారి తగ్గడానికి కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. బాల్యంలో సరైన వసతులు లేకపోవడం కూడా వారు ఎత్తును ప్రభావం చేస్తుందని చెబుతున్నారు. అయితే 2007 ఆర్థిక సంక్షోభం దీనికి కారణం కావచ్చన్నన విశ్లేషణ ఊహాజనితమేనని.. దీన్ని నిర్థారించే శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు వెల్లడించారు.

Dutch People2

Dutch People

అమెరికన్లు కూడా క్రమంగా ఎత్తు తగ్గిపోతున్నారని.. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ దీనికి కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. సరైన డైట్ తీసుకోకపోవడం, ఎక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడం తదితరాలు కారణం కావచ్చని చెబుతున్నారు.

Also Read..

Allu Arjun: మేడమ్ సర్ మేడమ్ అంతే.. అల వైకుంఠపురంలో క్రేజ్ అస్సలు తగ్గడంలేదుగా….

Nidhhi Agerwal : నితిన్‌కు జోడీ ఇస్మార్ట్ బ్యూటీ.. మాచర్ల నియోజక వర్గంలో ఆ హీరోయిన్..