AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పంటి నొప్పితో ఆస్పత్రికొచ్చి ప్రాణాలు కోల్పోయింది.. డాక్టర్లు CT స్కాన్ చేయగా

మానవ జీవితంలో ఎప్పుడు.? ఏం.? జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. జననం, మరణం మధ్య ఊగిసలాడేది మనిషి జీవితం. ఈ తరహలోనే ఓ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.? ఓ సారి లుక్కేయండి.

Viral: పంటి నొప్పితో ఆస్పత్రికొచ్చి ప్రాణాలు కోల్పోయింది.. డాక్టర్లు CT స్కాన్ చేయగా
Trending
Ravi Kiran
|

Updated on: Feb 26, 2025 | 10:46 AM

Share

కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం అంటారు పెద్దలు. మనిషి ఎలా మరణిస్తాడో కొన్నిసార్లు వైద్యుడికి కూడా అంతుపట్టదు. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి యూకేలో వెలుగులోకి వచ్చింది. పంటినొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఆమె.. విగతజీవిగా మారింది. చివరికి సదరు మహిళ పోస్టుమార్టంలో నిజం తేలింది. ఆస్పత్రిలో ఉన్న వారందరూ ఇది తెలుసుకుని షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. యూకేలోని డర్హమ్‌లో నివాసముంటున్న 34 ఏళ్ల లీ రోజర్స్ దాదాపు రెండు వారాలుగా పంటి నొప్పితో బాధపడుతోంది. నొప్పి భరించలేనంతగా మారడంతో.. ఆమెను కుటుంబీకులు అంబులెన్స్‌లో నార్త్ డర్హమ్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడున్న వైద్యులు ఆమెకు CT స్కాన్ చేయించగా.. కారణం ఏంటన్నది అంతుచిక్కలేదు. కొద్దిరోజుల తర్వాత ఆమె విగతజీవిగా మారింది. దీంతో ఆ మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు డాక్టర్లు. ఆమె మరణానికి గల అసలు కారణం బయటపడటంతో.. అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ మహిళ మరణానికి అసలు కారణం పంటి నొప్పి కాదు.. అలెర్జీ అని CT స్కాన్‌లో తేలింది. సదరు అలెర్జీ ఆమెకు నోటి నుంచి ఒళ్లంతా పాకిందని.. అదొక ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని వైద్యులు చెప్పారు.

శస్త్రచికిత్స సమయంలో ఆమెకు అయోడిన్ కలిగిన కాంట్రాస్ట్ డై ఇచ్చారు వైద్యులు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆమె విగతజీవిగా మారింది. ఈ సమయంలో ఆమెను కాపాడటానికి 90 నిమిషాల పాటు శ్రమించారు వైద్యులు. కానీ చివరికి ఆమె చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించాల్సి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. కోర్టులో ఆమె మృతి అసాధారణమైనదిగా.. దురదృష్టకరంగా పేర్కొంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక