AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రన్నింగ్‌ ట్రైన్ ముందు నిలబడి యువతి ఫోజ్.. తిక్క కుదిర్చిన లోకో పైలట్..! ఏం చేశాడో తెలిస్తే శభాష్‌ అనాల్సిందే..!!

లోకో పైలట్‌ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసించారు. మంచి పనే చేశాడంటూ కొనియాడుతున్నారు. సెల్ఫీల కోసం ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం అంటూ మరికొందరు అంటున్నారు. చాలా మంది నెటిజన్లు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.30లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. ప్రజలు దీనిని విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

Watch: రన్నింగ్‌ ట్రైన్ ముందు నిలబడి యువతి ఫోజ్.. తిక్క కుదిర్చిన లోకో పైలట్..! ఏం చేశాడో తెలిస్తే శభాష్‌ అనాల్సిందే..!!
Selfie In Front Of Train
Jyothi Gadda
|

Updated on: Jul 01, 2024 | 9:25 AM

Share

క్రేజ్‌ ముదిరితే, కొంపలు మునిగినట్టే. అలాంటి క్రేజ్‌లో ఒకటే సెల్ఫీ కూడా.. పిల్లల నుంచి పెద్దల వరకూ వయసుతో తేడా లేకుండా ప్రాంతంతో పట్టింపు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సెల్ఫీ మాయాలో పడిపోయారు. ప్రమాదకర స్థలాల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎత్తయిన ప్రాంతాలు, బస్సులు, స్పీడ్‌గా వెళ్తున్న బైక్‌లు, రన్నింగ్‌ ట్రైన్లు దేన్నీ వదలకుండా క్రేజీ సెల్ఫీల కోసం ప్రాణాలు సైతం లెక్కచేయటం లేదు. పరిస్థితులను గమనించకుండా సెల్ఫీ తీసుకుంటే అదే చివరి సెల్ఫీ అవుతుందని గ్రహించలేకపోతున్నారు. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రైలు ముందు నిలబడి ఓ అమ్మాయి సెల్ఫీ వీడియో తీసేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత జరిగిన సీన్‌ చూస్తే మీరు కూడా సరైనదే అంటారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరల్‌ వీడియోలో రైలు పట్టాలపై దూసుకు రావటం కనిపించింది. వస్తున్న రైలు ఇంజన్‌ ముందు ఓ మహిళ నిల్చొని ఉండగా, మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. రైలు ఇంజన్‌ ఆమెకు సమీపంలోకి వచ్చింది. కానీ, తను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు..ఎదురుగా వీడియో తీస్తున్న వ్యక్తి కూడా చుట్టుపక్కల పరిస్థితిని గమనించటం లేదు. ఈ క్రమంలోనే రైలు ఇంజిన్‌ బోగీలోంచి లోకో పైలట్‌ బయటకు వచ్చాడు.. రైలు పట్టాలపై ప్రమాదకరంగా నిలబడి ఉన్న ఆ మహిళను ఒక్క తన్ను తన్నాడు. దెబ్బకు ఆమె దూరంగా పడిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by UNILAD Tech (@uniladtech)

ఇలా రైలు ఇంజిన్ ముందు వీడియోలు తీసుకోవడం ప్రమాదమని తెలిసినా, ఈ యువతి చేసిన పిచ్చి పనికి.. లోకోపైలటర్‌ గట్టి గుణపాఠం చెప్పాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. లోకో పైలట్‌ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసించారు. మంచి పనే చేశాడంటూ కొనియాడుతున్నారు. సెల్ఫీల కోసం ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం అంటూ మరికొందరు అంటున్నారు. చాలా మంది నెటిజన్లు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.30లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. ప్రజలు దీనిని విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..