Amala Paul Hairstylist: ‘హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం’ అమలా పాల్ ఇలా చేసిందా.?

వెండితెరపై నటీనటులు అంతంగా కనిపించేలా చేయడంలో మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్ట్‏లు ముఖ్య పాత్ర పోషిస్తారు. పాత్రకు తగినట్లుగా హీరోహీరోయిన్లను అందంగా రెడీ చేసి అడియన్స్ హృదయాల్లో స్థానం కల్పించేలా చేస్తారు. కానీ సినిమా షూటింగ్ సెట్‏లో వారికి తగిన గౌరవం, గుర్తింపు ఉండదు. అలాగే కొన్నిసార్లు పలువురు తారలతో తమకు చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయని అంటున్నారు మేకప్ ఆర్టిస్టులు.

Amala Paul Hairstylist: 'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?

|

Updated on: Jul 01, 2024 | 9:35 AM

వెండితెరపై నటీనటులు అంతంగా కనిపించేలా చేయడంలో మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్ట్‏లు ముఖ్య పాత్ర పోషిస్తారు. పాత్రకు తగినట్లుగా హీరోహీరోయిన్లను అందంగా రెడీ చేసి అడియన్స్ హృదయాల్లో స్థానం కల్పించేలా చేస్తారు. కానీ సినిమా షూటింగ్ సెట్‏లో వారికి తగిన గౌరవం, గుర్తింపు ఉండదు. అలాగే కొన్నిసార్లు పలువురు తారలతో తమకు చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయని అంటున్నారు మేకప్ ఆర్టిస్టులు. అలాంటి ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, హీరోయిన్ అమలా పాల్ తమ ప్రవర్తించిన తీరును బయటపెట్టింది ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హేమ.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హెయిర్ స్టైలిస్ట్ హేమ.. ఒకసారి తాను హీరోయిన్ అమలా పాల్ తో కలిసి చెన్నై షూటింగ్ కు వెళ్లానని చెబుతూ.. ఆమె తనతో ప్రవర్తించిన తీరును చెప్పింది. “నాకు ఆమె గురించి తెలియదు. కేవలం ఓ స్నేహితుడి ద్వారా మాత్రమే పరిచయం. ఏప్రిల్, మేలో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడ చాలా ఎండ, వేడిగా ఉంది. దీంతో నీడ కోసం చూస్తే ఆ లొకేషన్ లో ఒక చెట్టు కూడా లేదు. దీంతో అక్కడే ఉన్న వ్యానిటీ వ్యాన్ లోపలికి వెళ్లాము. అందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి కళాకారులు కూర్చోవడానికి, మరొకరి టెక్నికల్ టీం ఉండటానికి. కానీ మేము లోపల కూర్చోగానే అమలా పాల్ మేనేజర్ వచ్చి మమ్మల్ని బయటకు వెళ్లిపోవాలని.. అందులో కూర్చొవడానికి వీల్లేదని చెప్పాడు. దీంతో నేను మేకప్ ఆర్టిస్టు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. ఇంత వేడిలో బయటకు ఎక్కడికి వెళ్తాము ? అని అనుకున్నాము.. కానీ ఆ వ్యాన్ నుంచి దిగవలసి వచ్చింది” అని చెప్పుకొచ్చింది.

“దక్షిణాదిలో ఎలా పనిచేస్తారో నాకు తెలియదు. వ్యానిటీ వ్యాన్ లోపలికి హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్టులు రాకూడదని నియమాలు ఉన్నాయేమో అక్కడ. సౌత్ ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్ట్ లకు విలువ ఇవ్వరు. అందుకే వారికి మనల్ని మనం ఎలా పరిచయం చేసుకోవాలి ? నేను టబు వంటి వారి దగ్గర పనిచేశానని ఎలా చెప్పాలి. ? టబు మమ్మల్ని బాగా చూసుకుంటారు. మా అందరి కోసం మొత్తం వ్యాన్ బుక్ చేస్తారు. కానీ సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది” అని తెలిపింది. ప్రస్తుతం హేమ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కాగా.. అమలా పాల్ యాటిట్యూడ్ పై విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే