Telugu News Trending Dog Playing with Sprinkler video was gone viral in social media Telugu Viral News
Video Viral: ‘నా మనసు కూడా ఇలాగే డాగీతో ఆడాలని ప్రయత్నిస్తోంది’.. పార్కులో ఆడుకుంటున్న శునకానికి నెటిజన్లు ఫిదా..
కుక్కలు చాలా తెలివైనవి, విశ్వాసపూరిత జంతువులు. మనుషులకు త్వరగా మచ్చికయ్యే వీటిని పెంచుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అన్ని జంతువులతో పోలిస్తే కుక్కలు చాలా తొందరంగా మనుషులకు అలవాటు..
కుక్కలు చాలా తెలివైనవి, విశ్వాసపూరిత జంతువులు. మనుషులకు త్వరగా మచ్చికయ్యే వీటిని పెంచుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అన్ని జంతువులతో పోలిస్తే కుక్కలు చాలా తొందరంగా మనుషులకు అలవాటు అవుతాయి. వాటిని సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. వాటితో ఆడుకోవడం, కలిసి పని చేయం, వాకింగ్ కు తీసుకువెళ్లడం వంటివి చేస్తుంటారు. అవి చేసే ప్రతి చిన్న చిలిపి పనిని ఆస్వాదిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. సాధారణంగా కుక్కలు మనుషులతో కలిసి పార్కులో, నీటిలో ఆడుకునేందుకు ఇష్టపడతాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన తర్వాత, డాగీ ఎంత సంతోషంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తోటలోని స్ప్రింక్లర్ ముందు ఆనందంగా ఆడుకోవడం కనిపించింది. కొన్ని సెకన్ల ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కుక్క సరదాగా స్ప్రింక్లర్ ముందు ఆడుకోవడాన్ని చూడవచ్చు. తోటలో ఒక పువ్వు లాంటి స్ప్రింక్లర్, దాని నుంచి వచ్చే నీరు వివిధ దిశలలో వస్తుంది. ఇది చూసిన డాగీ దాని వెంట పరిగెత్తుతూ సంతోషంగా గంతులేస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కొద్ది సమయంలోనే ఇది వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ కుక్కతో ప్రేమలో పడ్డానని, ‘నా మనసు కూడా ఇలాగే డాగీతో ఆడాలని ప్రయత్నిస్తోంది’ అని మరో యూజర్ రాశారు.