గణపతి బప్పా మోరియా.. వినాయకుడి ముందు మోకరిల్లిన శునకం.. అచ్చం భక్తుల మాదిరిగానే..

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో అచ్చు మనుషుల మాదిరే ఓ మేక తన ముందరి కాళ్లతో మోకరిల్లింది. ముక్కంటి ముందు తల వంచి ప్రార్థన చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో కూడా బాగా వైరలైంది. తాజాగా అచ్చం అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకుంది.

గణపతి బప్పా మోరియా.. వినాయకుడి ముందు మోకరిల్లిన శునకం.. అచ్చం భక్తుల మాదిరిగానే..
Dog
Follow us

|

Updated on: Nov 16, 2022 | 8:18 AM

దైవభక్తికి ఎవరూ అతీతం కాదంటారు. మనుషులకే కాదు మూగ జంతువులకు కూడా దేవుడిపై భక్తి ఉంటుందని దీనిఅర్థం. ఇందుకు తగ్గట్లే ఆవు, పాము, కుక్క తదితర మూగ జంతువులు దేవుడిపై ఉండే భక్తిని వివిధ రకాలుగా చాటుకుంటున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో బాగా వైరలవుతున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో అచ్చు మనుషుల మాదిరే ఓ మేక తన ముందరి కాళ్లతో మోకరిల్లింది. ముక్కంటి ముందు తల వంచి ప్రార్థన చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో కూడా బాగా వైరలైంది. తాజాగా అచ్చం అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో ఒక శునకం వినాయకుడి దేవాలయం వద్ద మోకాళ్ల మోకరిల్లి ప్రార్థిస్తోంది. అతని పక్కనే ఉన్న వ్యక్తి కూడా దేవుడిని ప్రార్థిస్తున్నాడు.

ఈ ఘటనను ఒకరు రికార్డు చేసి అనంతరం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ‘పుణేలోని దగ్దుషేత్ గణపతి మందిర్ వద్ద ఏం జరుగుతుందో చూడండి’ అని క్యాప్షన్‌ పెట్టాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  ఈ వీడియోకి 1.5 మిలియన్లకు పైగా వ్యూస్ మరియు 261k లైక్‌లు వచ్చాయి.  కాగా ఈ వీడియోలో కనిపిస్తున్నది ఒక పెంపుడు కుక్కేనని, పక్కనున్న వ్యక్తి దాని యజమాని అని, అందుకే అతను ఏం చేస్తుంటే శునకం కూడా అదే చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే మరికొందరు గణపతి బప్పా మోరియా అంటూ లవ్‌, హార్ట్ ఎమోజీలు షేర్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Pure thrift (@thrifts_grace)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..