AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కోతికి, కుక్కకు మధ్య చిగురించిన స్నేహం.. ఇంకేముంది రెండూ కలిసి ఊరంతా..

Viral Video: ‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ అనే పాట వినే ఉంటారు. స్నేహం మాధుర్యం అంత గొప్పది మరి. ఈ లోకంలో కష్టమొచ్చిన, బాధ వచ్చినా, సంతోషమొచ్చినా..

Viral Video: కోతికి, కుక్కకు మధ్య చిగురించిన స్నేహం.. ఇంకేముంది రెండూ కలిసి ఊరంతా..
Dog
Shiva Prajapati
|

Updated on: Nov 14, 2021 | 12:26 PM

Share

Viral Video: ‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ అనే పాట వినే ఉంటారు. స్నేహం మాధుర్యం అంత గొప్పది మరి. ఈ లోకంలో కష్టమొచ్చిన, బాధ వచ్చినా, సంతోషమొచ్చినా.. దుఃఖమొచ్చినా పంచుకునేది ఒక్క స్నేహితుడితోనే. ఈ స్నేహం మనుషులకే పరిమితం కాదు. జంతువుల్లోనూ చిగురిస్తుంది. లింగ బేధం లేకుండా, జాతి బేధం లేకుండా సమస్త జీవకోటిలోనూ స్నేహ భావన కలుగుతుంది. అందుకు నిదర్శనమైన ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసింది.

జాతి వైరాన్ని మరచి రెండు జంతువులు చెలిమి చేసి చెట్టాపట్టాలు వేసుకుని ఊరంతా కలియ తిరుగుతున్నాయి. ఒకదాని వీపుపై మరొకటి ఎక్కి ఊరంగా తిరుగుతుంటే.. గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా కుక్క, కోతి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. కుక్క ని చూస్తే కోతి ఆమడ దూరం పరుగెడుతుంది. ఒక్కోసారి కుక్కకు చుక్కలు చూపిస్తుంది కోతి. ఏదైనా పొలాల్లో గాని, చెట్టు మీదకు గానీ కోతులు వస్తే వాటిని తరిమేందుకు కుక్కల్ని ఉసిగొల్పుతారు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ సీన్ కనిపించింది. వైరి జీవులు కాస్తా ఒక్కటయ్యాయి. ఎంతలా అంటే.. ఒకదానిని విడిచి మరొకటి ఉండలేనంతగా కలిసిపోయాయి.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో స్థానిక లింగంపర్తి రోడ్డులో కుక్క, కోతి మధ్య స్నేహం కుదిరింది. ఆ రెండూ ఒకదానికొకటి అమితమైన ప్రేమను పంచుకుంటూ ఊరంతా కలియ తిరుగుతున్నాయి. కుక్క మీద కోతి సవారీ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఆ కుక్క సైతం కోతి పిల్లను అమ్మలా లాలిస్తుంది. ఇలాంటి ఘటనలు మనం చాలా అరుదుగా చూస్తుంటాం. కొద్ది రోజుల క్రితం ఏలేశ్వరానికి చెందిన ఒక వ్యక్తి కుక్కను చేరదీసి పెంచుకుంటున్నాడు. అలాగే తన ఇంటి వద్ద గాయాలతో పడి ఉన్న కోతి పిల్లను చికిత్స చేసి దానిని కూడా పెంచసాగాడు. ఈ నేపథ్యంలోనే కుక్కకు, కోతికి మధ్య స్నేహం చిగురించింది. రెండూ కలిసి హాయిగా చెలిమి చేస్తున్నాయి. వీటి స్నేహాన్ని చూసి గ్రామస్తులు సైతం మురిసిపోతున్నారు. ఆ రెండూ కలిసి తిరుగుతుంటే.. గ్రామస్తులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Also read:

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్టు కష్టాలు.. అసంతృప్తి వ్యక్తం చేసిన నిర్మాణ సంస్థ.. ట్వీట్ వైరల్..

Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా ? అప్పట్లో తెలుగునాట సెన్సేషన్..

Suriya JaiBhim: మంత్రి చేసిన ఆరోపణలను ఖండించిన సూర్య.. జైభీమ్ గురించి ఆసక్తికర విషయాలు..