Dreams: కలలో మురికి నీటిలో స్నానం చేస్తున్నట్టు కనిపించిందా.? అర్ధం ఏంటో తెల్సా
అందరూ కలలు కంటుంటారు. కొందరికి మంచి కలలు వస్తే.. మరికొందరికి పీడకలలు వస్తాయి. అయితే ఈ కలలు కూడా మనం రోజూ చేసే దినచర్య బట్టి వస్తాయని కొందరు చెబుతుంటారు. మీకు అకస్మాత్తుగా..
అందరూ కలలు కంటుంటారు. కొందరికి మంచి కలలు వస్తే.. మరికొందరికి పీడకలలు వస్తాయి. అయితే ఈ కలలు కూడా మనం రోజూ చేసే దినచర్య బట్టి వస్తాయని కొందరు చెబుతుంటారు. మీకు అకస్మాత్తుగా కలలో స్నానాల గదిలో లేదా ఏదైనా నది ఒడ్డున స్నానం చేస్తున్నట్లు కనిపిస్తే అది శుభంగా పరిగణించవచ్చునని జోతిష్యులు చెబుతున్నారు. అది మీకు శుభసూచకం కావచ్చునట. జలపాతం కావచ్చు, మరెక్కడైనా మంచి నీటితో స్నానం చేస్తున్నట్లు కల వస్తే అది చాలా మంచి కలగా భావించవచ్చు. ఈ కల రాబోయే రోజుల్లో మీకు ఆనందం, సంపదను తెచ్చిపెడుతుందట. రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యం చాలా బాగుంటుందని కూడా దీని అర్థం. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు మీకు ఈ కల వస్తే రాబోయే రోజుల్లో మీరు కోలుకుంటారని దాని అర్థమట. మీరు మంచి ఆరోగ్యంతో ఉన్నట్లయితే, మీకు అలాంటి కల కనిపిస్తే, రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు మరిన్ని ప్రయత్నాలు చేస్తారని కూడా ఈ కల మీకు చెబుతుంది.
అలా కాకుండా, కలలో మురికి నీటితో స్నానం చేసినట్టు కనిపిస్తే.. అది చెడ్డ కలగా పరిగణలోకి తీసుకోవాలట. రాబోయే రోజుల్లో ఒక రకమైన మానసిక కల్లోలం మిమ్మల్ని వెంటాడుతుందని ఈ కల మిమ్మల్ని హెచ్చరిస్తోంది. మీరు చేసే అన్ని పనుల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ కల సూచిస్తుంది. ఈ కల మీరు జాగ్రత్తగా ఆలోచించి, ప్రమాదంతో కూడిన పనులను చేయాలని మీకు చెబుతుంది. మీరు మీ కలలో మీ పాదాలను కడుగుతున్నట్లు కనిపిస్తే, అది మంచి కల అని చెప్పవచ్చు. మీరు చాలా నెలలు లేదా సంవత్సరాలుగా ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలని కష్టపడుతూ ఉంటే/ప్రయత్నిస్తుంటే, రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా ఆ లక్ష్యాన్ని సాధిస్తారని ఈ కల చెబుతోంది. మొత్తంమీద, మీ కలలో మంచి నీటిలో స్నానం చేయడం మంచి సంకేతం, మురికి నీటిలో స్నానం చేయడం చెడ్డ సంకేతం.
ఇది చదవండి: బాబోయ్.! ఏంట్రా ఇది.. మ్యాజిక్ మష్రూమ్‌లను తిన్న తర్వాత ప్రైవేటు పార్ట్‌ను..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..