Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రాళ్లు పగులగొడుతుండగా కనిపించింది చూసి ఆశ్చర్యం.. ఏంటని చెక్ చేయగా.!

అదృష్టం ఎప్పుడు.. ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కొందరికి మట్టి తవ్వుతుండగా లంకె బిందెలు దొరుకుతాయి. ఇంకొందరికి పురాతన ఇళ్లు కూల్చుతుండగా.. ప్రాచీన వస్తువులు బయటపడుతుంటాయి. ఇక ఇలాంటి చిత్రవిచిత్రమైన సంఘటనలకు సంబంధించి వీడియోలు..

Viral Video: రాళ్లు పగులగొడుతుండగా కనిపించింది చూసి ఆశ్చర్యం.. ఏంటని చెక్ చేయగా.!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 09, 2024 | 12:12 PM

అదృష్టం ఎప్పుడు.. ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కొందరికి మట్టి తవ్వుతుండగా లంకె బిందెలు దొరుకుతాయి. ఇంకొందరికి పురాతన ఇళ్లు కూల్చుతుండగా.. ప్రాచీన వస్తువులు బయటపడుతుంటాయి. ఇక ఇలాంటి చిత్రవిచిత్రమైన సంఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఈ తరహ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ వ్యక్తికి అనుకోని అదృష్టం అనూహ్యంగా అతడి తలుపు తట్టింది.

ఇది చదవండి: గ్యాస్‌స్టవ్ పక్కనే వంటనూనె పెట్టే అలవాటుందా.! క్యాన్సర్ కొనితెచ్చుకున్నట్టే.?

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన దగ్గరున్న సుత్తితో బండరాళ్లను పగలుగొడుతుంటాడు. ఓ పెద్ద బండరాయి.. ఆ తర్వాత మరో రాయి.. ఇలా ఒక్కొక్కదానిని పూర్తిగా బద్దలుకొట్టి.. మొత్తం ముక్కలుగా చేసి పెకిలిస్తాడు. ఇక ఆ రాయి కింద ఉన్న మట్టిని తొలగిస్తుండగా.. అక్కడ ఏదో ఉన్నట్టు అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఏంటని చూడగా.. అదొక పెద్ద వజ్రంలా అనిపిస్తుంది. పరిశీలించగా అది మెరుస్తూ ఉంటుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కొందరు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. ‘అదృష్టం అంటే ఇతడిదే బాసూ’ అని కొందరు కామెంట్ చేస్తే.. ‘ఇదంతా కావాలనే ప్లాన్ చేసింది’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..

View this post on Instagram

A post shared by Raw Specimen (@rawspecimen)

ఇది చదవండి: ఓ మై గాడ్.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంట్రా.. కింగ్ కోబ్రా ముందు కుప్పిగంతులా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి