Viral Video: తండ్రితో కలిసి పెళ్లికూతురు డ్యాన్స్.. వైరల్ అవుతోన్న వీడియో..
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన అనుభూతి. ముఖ్యంగా ఆడ పిల్లలు వివాహం గురించి ఎన్నో కలలు కంటారు. పెళ్లై అత్తారింటికి వెళ్తుంటే భావోద్వేగాని గురవుతారు...

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన అనుభూతి. ముఖ్యంగా ఆడ పిల్లలు వివాహం గురించి ఎన్నో కలలు కంటారు. పెళ్లై అత్తారింటికి వెళ్తుంటే భావోద్వేగాని గురవుతారు. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్తారు. అప్పటిదాగా ప్రాణంగా చూసుకున్న తండ్రి, అప్యాయంగా పెంచిన తల్లి, అండగా ఉండే సోదరుడిని విడిచి వెళ్లాలంటే ఎవరికైనా బాధే.. కానీ పెళ్లైన ప్రతి అమ్మాయి భర్త ఇంటికి వెళ్లక తప్పదు. ఇలా ఓ అమ్మాయి పెళ్లై అత్తారింటి వెళ్లే ముందు తన తల్లిదండ్రులతో ఆనందగా గడిపింది. అభి నా జావో చోడ్ కర్ అనే ఐకానిక్ పాటకు తండ్రితో కలిసి డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరి డ్యాన్స్‌కి సంబంధించిన ఎమోషనల్ క్లిప్ అందరి హృదయాలను కదలించింది.
View this post on Instagram
ఈ వీడియోను వెడ్డింగ్ కొరియోగ్రాఫర్స్ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. క్లిప్‌లో వధువు తన తండ్రితో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆ అమ్మాయి అందమైన లెహంగా ధరించి ఉండగా, ఆమె తండ్రి నీలి రంగు కుర్తా పైజామాలో ఉన్నారు. వారు ఒకరితో ఒకరు చేయి చేయి వేసుకుని నృత్యం చేశారు. ప్రదర్శన మిస్ కాకుండా చాలా మనోహరంగా ఉంది. వీడియో దాదాపు 80,000 వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు కామెంట్ల్, లైక్‌లు చేస్తున్నారు. ఏ ఆడ పిల్లకైనా బాధ ఉంటుంది. తల్లిదండ్రులను విడిచి వెళ్లడం కన్నీళ్లను తెప్పిస్తుందని నెటిజన్లు కామెంట్లు రాశారు. అభి నా జావో చోడ్ కర్ అనేది దేవ్ ఆనంద్, నందా, సాధన నటించిన 1961 చిత్రం హమ్ దోనోలోని పాట. దీనిని మహ్మద్ రఫీ పాడారు. జైదేవ్ సంగీతం సమకూర్చారు. సాహిత్యాన్ని సాహిర్ లుధియాన్వి అందించారు.
Read Also.. Viral Video: నాగుపాము, కొండచిలువ మధ్య భీకర యుద్దం.. ఎవరు గెలిచారో చూడండి..