Viral: ఆ యువతికి 2 రోజులుగా మల విసర్జన అవ్వలే – పొత్తి కడుపులో నొప్పి – ఆస్పత్రికి వెళ్లగా
27 ఏళ్ల యువతి.. తీవ్రమైన కడుపు నొప్పి.. 2 రోజులుగా మల విసర్జన అవ్వడం లేదంటూ ఆస్పత్రికి వచ్చింది. ప్రాథమిక పరీక్షలు చేసిన అనంతరం డాక్టర్లకు కొన్ని అనుమాలు కలిగాయి. దీంతో తన ప్రాణాన్ని కాపాడుకోడానికి.. ఆ యువతి తాను చేసిన అభ్యంతరకర పని గురించి వివరించింది.

ఢిల్లీకి చెందిన ఓ 27 ఏళ్ల యువతి.. పొత్తి కడుపులో నొప్పి, రెండు రోజులుగా మల విసర్జన అవ్వకపోవడం వంటి సమస్యలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చింది. ప్రాథమిక పరీక్షల తర్వాత యువతి తీరుపై అనుమానం వచ్చి ప్రశ్నించగా.. లైంగిక ఆసక్తితో మాయిశ్చరైజర్ బాటిల్‌ను 2 రోజలు క్రితం శరీరంలోకి చొప్పించనట్లు అంగీకరించింది. దీంతో డాక్టర్లు సిగ్మాయిడోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అవసరం లేకుండా ఆ బాటిల్‌ను తొలగించగలిగారు.
ముందుగా ఆమె ఓ స్థానిక ఆసుపత్రిని సంప్రదించినా… అక్కడ చికిత్స విఫలమైంది. ఆపై తీసిన ఎక్స్‌రే స్కాన్‌లో బాటిల్ పై భాగంలో ఉన్న రెక్టల్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఆ స్థితిలో ఆపరేషన్ తప్పనిసరి అయిపోయిన వేళ.. నిపుణుల బృందం రంగంలోకి దిగింది. డాక్టర్లైన తరణ్ మిట్టల్, ఆశిష్ డే, అన్మోల్ అహుజా, శ్రేయస్ మంగళిక్, అనస్తటిస్ట్ ప్రశాంత్ అగర్వాల్ నేతృత్వంలో అత్యంత జాగ్రత్తగా సిగ్మాయిడోస్కోపీ పద్ధతిలో బాటిల్‌ను తొలగించారు. శరీరాన్ని కోయకుండా చేసిన ఈ ప్రక్రియ వల్ల బాధితురాలు వేగంగా కోలుకుంది
ఈ ఘటనపై డాక్టర్ అన్మోల్ అహుజా మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఘటనల్లో సమయానికి జోక్యం అవసరం. ఆలస్యం చేస్తే కడుపు చీలిపోవడం వంటి ప్రాణాపాయ సమస్యలు తలెత్తొచ్చు. ఇలాంటి సందర్భాల్లో సిగ్మాయిడోస్కోపీ, లాపరాస్కోపీ లాంటి ఎండోస్కోపిక్ విధానాలు చక్కగా ఉపయోగపడతాయి’’ అన్నారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం మెరుగుపడడంతో మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు.
అయితే ఇది ఏదో టైం పాస్ వార్త అనుకోకండి. లైంగిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు, అవగాహన అవసరం. ఇలాంటి చర్యలు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శృంగార తృప్తి కోసం శరీరంలోకి వస్తువులు చొప్పించడాన్ని డాక్టర్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ‘‘ఇది ఒక విధంగా శరీరాన్ని హింసించడమే. ఇలాంటి చర్యల వల్ల పేగులు చీలిపోవడం, ఇన్‌ఫెక్షన్లు రావడం, జీవితాంతం మలద్వార సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వెంటనే వైద్య సహాయం తీసుకోవడమే కాదు.. మానసికంగా కౌన్సిలింగ్ కూడా అవసరం’’ అని నిపుణులు చెబుతున్నారు. అసాధారణ శృంగార అభిరుచుల ద్వారా శరీరాన్ని ప్రమాదంలో నెట్టవద్దని సూచిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..