Viral News: డెడ్లీ డిష్.. చస్తారని తెలిసి కూడా తింటారట.. ఎగబడుతున్న భోజనప్రియులు.. ఎక్కడో తెలుసా!
ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం ఫేమస్..అందుకే చాలా మంది భోజనప్రియులు... దేశవిదేశాలు తిరుగుతూ వారికి నచ్చిన ఇష్టమైన...

ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం ఫేమస్..అందుకే చాలా మంది భోజనప్రియులు… దేశవిదేశాలు తిరుగుతూ వారికి నచ్చిన ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ రుచి చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు..ఇటీవల కాలంలో మరికొందరైతే ఆ ఫుడ్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. అయితే ఇలాంటి భోజన ప్రియులు ఒక వంటకం గురించి తప్పక తెలుసుకోవాలి..ఎందుకంటే..ఇది తింటే చనిపోయే ప్రమాదం ఉంది. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న వారు మాత్రమే ఈ వంటకాన్ని రుచి చూస్తారు.
జపాన్‌లోని యమగుచి ప్రిఫెక్చర్ లో పాపులారిటీ సంపాదించుకున్న ఆహార పదార్థాలలో డెడ్లీ డిష్ ఒకటి. ఈ ఫుడ్ తినడానికి ఎంతో రుచిగా ఉంటుందట… అయితే దీన్ని తయారు చేసేటప్పుడు ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలు కోల్పోవడం ఖాయమట..అందుకే ఈ ఆహార పదార్థాలను ప్రత్యేక లైసెన్స్ కలిగిన రిజిస్టర్డ్ చెఫ్ లతో తయారుచేస్తారు.
జపాన్‌లోని షున్‌పాన్రో ఫుగూతో వంటకాలను తయారుచేస్తారు. ఫుగూలో టెట్రోడోటాక్సిన్ అనే విషం ఉంటుంది. పొరపాటున ఈ విషం… తిన్నవారి బాడీలోకి వెళితే తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకే దీనిని డెడ్లీ ఫుడ్ అని పిలుస్తారు. అయితే అత్యంత రుచిగా ఉండే ఈ వంటకాన్ని తినకుండా ఉండలేకపోతున్నారట అక్కడి కొందరు ఆహార ప్రియులు. అందుకే వీటిని తయారీపై నిషేధం ఉన్నప్పటికీ సీక్రెట్ ఇప్పటికీ తయారు చేస్తూనే ఉన్నారు.